బిజినెస్

కుప్పకూలిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం కుప్ప కూలాయి. మరోసారి ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించవచ్చన్న భయాలకు తోడు, కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడం కలిపి మదుపరుల సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బ తీశాయి. దీంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ 807 పాయింట్లు నష్టపోయి 23 వేల పాయింట్ల దిగువకు చేరుకుంది. 21 నెలల తర్వాత అంటే ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెనె్సక్స్ 23 వేల పాయింట్ల దిగువకు చేరడం ఇదే మొదటిసారి. ఫలితంగా లిస్టింగ్ అయిన అన్ని కంపెనీల స్టాక్స్ మొత్తం విలువ కలిపి చూస్తే మదుపరుల సంపద ఈ ఒక్కరోజే 3 లక్షల కోట్లకు పైగా హారతైపోయింది. దాదాపు ఏడాది క్రితం అంటే గత ఏడాది మార్చి 4న గతంలో ఎన్నడూ లేని విధంగా గరిష్ఠంగా 30,024 పాయింట్లకు చేరుకున్న సెనె్సక్స్ ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ ఏడాది కాలంలో సెనె్సక్స్ మొత్తంమీద 23 శాతం పడిపోయింది. ఫలితంగా మదుపరుల సంపద దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు ఆవిరై పోయింది. దీంతో దేశీయ మార్కెట్లు ఇప్పుడు బేర్ మార్కెట్‌లోకి ప్రవేశించినట్లయింది.
నిన్నటి ముగింపుకన్నా దిగువ స్థాయిలో 23,758.46 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ ఆ తర్వాత బ్లూచిప్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి కారణంగా ఒక దశలో 22,909.12 పాయింట్ల కనిష్టస్థాయిని తాకింది. చివరికి 807 పాయింట్ల నష్టంతో 22,951.83 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 239.35 పాయింట్లు పడిపోయి, 7 వేల పాయింట్ల దిగువన 6,976.35 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ల పతనం ఎంత విస్తతంగా ఉందంటే సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 28 కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. సిప్లా, డాక్టర్ రెడ్డీస్ మాత్రమే లాభాల్లో మగిసాయి. భారీగా నష్టపోయిన స్టాక్స్‌లో అదానీ పోర్ట్స్, బిహెచ్‌ఇఎల్, టాటా మోటార్స్, ఒఎన్‌జిసి, ఎంఅండ్‌ఎం, టాటా స్టీల్, హెచ్‌డిఎఫ్‌సి, రిల్, యాక్సిస్ బ్యాంక్, గెయిల్, మారుతి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, లుపిన్, ఐటిసి ఉన్నాయి. కీలక కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మందగించవచ్చన్న భయాలు, విదేశీ పోర్ట్ఫులియో ఇనె్వస్టర్లు అమ్మకాలకు పాల్పడుతూ ఉండడం, ఆర్థిక వృద్ధి మాంద్యం మరింత తీవ్రం కావచ్చన్న భయాల కారణంగా చమురు ధరలు మళ్లీ పెరుగుతుండడం ఇవన్నీ కలిసి మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. మూడో త్రైమాసికంలో దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బిఐ నికర లాభాలు 67 శాతం తగ్గడంతో దాని షేరు ఈ రోజు దాదాపు 3 శాతం పడిపోయింది. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లతో పాటుగా ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్లో ముగిశాయి. హాంకాంగ్ లిస్టెడ్ షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి. ఐరోపా మార్కెట్లు కూడా ప్రారంభంనుంచే నష్టాల్లో కొనసాగాయి.
మిగతా మార్కెట్లకన్నా మెరుగే
కాగా, భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి మదుపరులు వెనకడుగేస్తున్నప్పటికీ ఆన్థిక మంత్రిత్వ శాఖ మాత్రం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్లు మెరుగ్గానే ఉన్నాయని అంటోంది. మన స్టాక్ మార్కెట్లు ఇతర మార్కెట్లంత ఘోరంగా ఏమీ లేవని ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అంతేకాదు సవాళ్లను ఎదుర్కోవడానికి అపభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అంటూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి రేటు 7.6 శాతం ఉండవచ్చన్న సెంట్రల్ స్టాటిటిక్స్ ఆర్గనైజేషన్ (సిఎస్‌ఓ) అంచనా చాలా గొప్ప పరిణామమమని అన్నారు. అంతర్జాతీయ పరిణామాల కారణంగానే మార్కెట్లు పతనమైనాయని కూడా ఆయన అభిప్రాయ పడ్డారు.

ఆన్‌లైన్ ద్వారా పిఎఫ్ విత్‌డ్రాయల్స్
ఆగస్టు నుంచి అందుబాటులోకి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఉద్యోగ భవిష్యనిధి చందాదారులకు మెరుగైన, సత్వర సేవలు అందించి, కాగితాల వినియోగాన్ని తగ్గించాలని భావిస్తున్న ఇపిఎఫ్‌ఓ త్వరలో ఆన్‌లైన్ ద్వారా పిఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే పిఎఫ్ విత్‌డ్రా క్లెయిములు కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే పరిష్కారమవుతాయి. ‘ఉద్యోగ భవిష్య నిధి చందాదారులు ఆన్‌లైన్ ద్వారా పిఎఫ్ విత్‌డ్రా చేసుకునే సదుపాయాన్ని ఆగస్టు నెలాఖరు నాటికి అందుబాటులోకి తీసుకురాగలమని ఆశిస్తున్నా. ఇందుకు సంబంధించి రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దీని కోసం ఒరాకిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నాం’ అని ఇపిఎఫ్‌ఓ సీనియర్ అధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థకు వివరించారు. ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇపిఎఫ్‌ఓ త్వరలో బ్లేడ్ సర్వర్లను కొనుగోలుచేసి గుర్గావ్, ద్వారక (్ఢల్లీ), సికింద్రాబాద్‌లో సెంట్రల్ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుందని, దేశంలోని 123 ఇపిఎఫ్‌ఓ కార్యాలయాలను ఈ మూడు డేటా సెంటర్లతో అనుసంధానించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మే నెలాఖరు నాటికి సర్వర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తిచేసి జూన్ నుంచి వాటి పనితీరును పరీక్షిస్తామని ఆయన చెప్పారు.