బిజినెస్

మార్కెట్ల నుంచి విల్‌ఫుల్ డిఫాల్టర్లను నిషేధించిన సెబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 29: ఉద్దేశపూర్వకంగా రుణాలు ఎగవేసేవారు(విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ఇకపై సెక్యూరిటీల మార్కెట్లనుంచి నిధులను సమీకరించడానికి కానీ, స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన కంపెనీల బోర్డుల్లో పదవులు చేపట్టడానికి వీలు లేదు. ఈ సవరించిన నిబంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబి నోటిఫై చేసింది. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగవేసే వారికి నిధులు వచ్చే మార్గాలను మూసివేయడానికి అత్యంత కఠినమైన విధానాలను ప్రకటించిన సెబి అలాంటి సంస్థలు లేదా వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్, మ్రోకింగ్ సంస్థలు లాంటి మార్కెట్‌లోజోక్యం చేసుకునే కంపెనీలను కూడా ఏర్పాటు చేయకుండా కూడా నిషేధించింది. అంతేకాకుండా ఇలాంటి వాళ్లు స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయిన ఏ ఇతర కంపెనీ కంట్రోల్‌ను చేపట్టడానికి కూడా వీలు లేదని సెబి స్పష్టం చేసింది. యుబి గ్రూపు చైర్మన్ విజయ్ మాల్యా చెల్లించకుండా ఉన్న సుమారు 9 వేల కోట్ల రూపాయల రుణాలను, వడ్డీని రాబట్టడానికి బ్యాంకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఆయన దేశం వదిలిపెట్టి బ్రిటన్‌లో ఆశ్రయం పొందిన నేపథ్యంలో సెబి ఈ చర్యలు తీసువడం గమనార్హం. కాగా, బుధవారంనుంచి అమలులోకి వచ్చిన ఈ కొత్త నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఉద్దేశపూర్వకంగా ఎగవేతదారుగా ప్రకటించిన ప్రతి వ్యక్తికి, కంపెనీకి వర్తిస్తాయి.