బిజినెస్

భారత్-అమెరికా వాణిజ్యంపై 3న జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: వచ్చే నెల 3వ తేదీన హైదరాబాద్‌లో ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో అమెరికా-్భరత్ మధ్య వాణిజ్య సంబంధాలు అంశంపై జాతీయ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభిస్తారు. ఈ సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, అమెరికా కాన్సుల్ జనరల్ మైఖేల్ ములీన్స్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, జిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎం రావు, కెపిఎంజి డిప్యూటీ సిఇవో అఖిల్ బన్సాల్, అప్పారెల్ ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ మండవ ప్రభాకరరావు, పాల్గొంటారు. ఐదు వందల బిలియన్ డాలర్లకు రెండు దేశాల మధ్య ఆర్ధిక వాణిజ్య టర్నోవర్ పెంచాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలంగాణ, ఆంధ్రా చాప్టర్ చైర్మన్ ఎం రామకృష్ణ తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఏరోస్పేస్ రంగాలపై సదస్సును నిర్వహిస్తారు. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరుగుతుందన్నారు.