బిజినెస్

ధైర్యం తెచ్చుకోండి.. సంస్కరణలు చేపట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 28: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ శనివారం ధ్వజమెత్తుతూనే సాహసోపేత సంస్కరణలకు వెళ్లడానికి అవసరమైన ధైర్యాన్ని కూడదీసుకోవాలని హితవు పలికింది. ప్రభుత్వానికి గనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపై తమ పార్టీ చర్చించడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ‘2014 జూన్ నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటబడింది. అప్పుడే గనుక లోక్‌సభలో స్పష్టమైన మెజారిటీ లేకపోవడం వల్ల యుపిఏ ప్రభుత్వం తీసుకోలేక పోయిన సాహసోపేతమైన, వ్యవస్థాగతమైన సంస్కరణలు తీసుకుని ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతం లభించి ఉండేది’ అని మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం అన్నారు. ‘ఇప్పుడు ఈ ప్రభుత్వానికి లోక్‌సభలో దాదాపు 283 మంది ఎంపీలున్నారు. కనుక ధైర్యం తెచ్చుకుని వ్యవస్థాగత సంస్కరణలు చేపట్టాలి. అంతేకాదు ప్రభుత్వం ప్రతిపక్షంతో కూడా చర్చించాలి. ప్రభుత్వం గనుక చిత్తశుద్ధితో ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ అందుకు సిద్ధంగా ఉంది’ అని మహారాష్టన్రుంచి రాజ్యసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేట్ అయిన చిదంబరం చెప్పారు. ఎన్‌డిఎ రెండేళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చిదంబరం విలేఖరులతో మాట్లాడారు. వస్తు సేవల పన్ను(జిఎస్‌టి)పై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన మూడు ప్రధానమైన అభ్యంతరాలపై ప్రభుత్వం చర్చించడంలో విఫలమైందని అన్నారు. ‘మేము లేవనెత్తిన అభ్యంతరాలు అర్థం లేనివని అయినా ప్రభుత్వం మమ్మల్ని ఒప్పించాలి, లేదా మా అభ్యంతరాలనైనా అంగీకరించి, ఆ మేరకు సవరణలైనా చేయాలి. అలాంటి ప్రయత్నం ఏదీ జరిగినట్లుగా కనిపించలేదు’ అని ఆయన అన్నారు. ప్రతిపక్షాన్ని కూడా విశ్వాసంలోకి తీసుకోవాలని, అది ఇచ్చే సూచనలను కూడా అంగీకరించాలని చిదంబరం ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ‘ప్రభుత్వానికి బైట కూడా తెలివైన వారున్నారు. వారిని పిలిచి మాట్లాడండి, వాళ్లు ఇచ్చే మంచి సలహాలు స్వీకరించండి.. మా ప్రభుత్వంతోసహా ఏ ప్రభుత్వానికైనా నేను ఇచ్చే సలహా ఇదే’ అని చిదంబరం అన్నారు. కాగా, మోదీ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై విశే్లషిస్తూ బిజెపి పాలనలో దేశం అన్ని రంగాల్లో ఎలా ఘోరంగా విఫలమయిందో వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన ఒక పుస్తకాన్ని చిదంబరం విడుదల చేశారు. ఇదే విధంగా దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మీడియా సమావేశాల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
రాజన్ గొప్ప ఆర్థికవేత్త
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఓ గొప్ప ఆర్థికవేత్తని చిదంబరం కొనియాడారు. ఈ ఏడాది సెప్టెంబర్ తొలి వారంతో ఆర్‌బిఐ గవర్నర్‌గా రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనున్న క్రమంలో ఆయన్ను కొనసాగించవద్దని బిజెపి నేతలు ప్రభుత్వానికి సూచిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలో బిజెపి ఎంపి సుబ్రమణ్యన్ స్వామి వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించిన చిదంబరం.. రాజన్‌కు వ్యతిరేకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లేదా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడితే, కాంగ్రెస్ తప్పకుండా బదులిస్తుందని అన్నారు. రాజన్ సమర్థుడు కాబట్టే, ఆయన్ను ఆర్‌బిఐ గవర్నర్‌గా కూర్చోబెట్టామని చెప్పారు. నిజానికి తమ యుపిఎ ప్రభుత్వం.. ఆర్‌బిఐ గవర్నర్లందరితోనూ సఖ్యతతో మెలిగిందని గుర్తుచేశారు. తద్వారా పరోక్షంగా ఇప్పుడు రఘురామ్ రాజన్‌పట్ల ఎన్‌డిఎ అవలంభిస్తున్న విధానాన్ని చిదంబరం విమర్శించారు.

చిత్రం విలేఖరులతో మాట్లాడుతున్న చిదంబరం