బిజినెస్

గరిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఆహార పదార్థాలు, ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో టోకు ధరల సూచీ ఆధారంగా లెక్కగట్టే ద్రవ్యోల్బణం గత ఆరునెలల్లో గరిష్ఠ స్థాయికి చేరుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 2.60 శాతం, అక్టోబర్‌లో 1.27 శాతం ఉన్న ఈ ద్రవ్యోల్బణం 2017 అక్టోబర్‌లో 3.5 శాతానికి చేరుకుంది. ఏప్రిల్ నెలలో గరిష్ఠ స్థాయిలో 3.85 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. అప్పటినుంచి ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల కారణంగా ద్రవ్యోల్బణం రెండింతలు పెరిగి 4.30కు చేరుకుందని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఉల్లిపాయలు, కూరగాయలు, కోడిగుడ్లు, చేపలు ఇలా అన్నింటి ధరలు భారీగా పెరగడం వల్ల అది అంతిమంగా ద్రవ్యోల్బణం తీవ్రం కావడానికి దోహదం చేసిందని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరిస్థితిని బట్టి చూస్తే రిజర్వుబ్యాంక్ త్వరలో ప్రకటించబోయే ద్రవ్య సమీక్షా విధానంలో ఎలాంటి మార్పులు ఉండవన్న విషయం స్పష్టమవుతోందని ప్రముఖ ఆర్థికవేత్త అదితీ నాయర్ తెలిపారు. డిసెంబర్ 6వ తేదీన ఆర్‌బిఐ తన తదుపరి ద్రవ్యవిధాన సమీక్షను ప్రకటించబోతోంది.
గత మూడు నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇంధన ద్రవ్యోల్బణం కూడా పెరిగిందని, అలాగే విద్యుత్ టారిఫ్ కూడా పెరగడం ఇందుకు కారణమైందని ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. పెట్రోలు, డీజిల్ దిగుమతుల కారణంగానే భారీగా భారం పడుతోంది కాబట్టి విధానకర్తలు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, వీటి ధరల పెరుగుదలను నిరోధించే ప్రయత్నం చేయాలని అసోచామ్ తెలిపింది.