బిజినెస్

మన శ్రీమంతులు 2,45,000

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: శ్రీమంతులు చిటారుకొమ్మన, పేదలు అట్టడుగున ఉన్న విడ్డూర పరిస్థితి భారత్‌ది. దేశ జనాభాలోని పెద్దల్లో 92 శాతంమంది ఆదాయం పదివేల డాలర్లలోపేనని, కానీ మిలియనీర్ల సంఖ్య 2,45,000 అని తాజా సర్వే వెల్లడించింది. రానున్న కొన్ని సంవత్సరాల కాలంలోనే ఈ శ్రీమంతుల సంఖ్య 3,72,000కు చేరుకునే అవకాశం ఉంది. 2000 సంవత్సరం నుంచి భారతదేశ సంపద వార్షికంగా 9.9 శాతం చొప్పున పెరుగుతూ వస్తోందని, ఇది అంతర్జాతీయ సగటు అయిన 6 శాతం కంటే చాలా ఎక్కువని ఈ సంస్థ వెల్లడించింది. అలాగే భారతదేశ సంపద వృద్ధి కూడా 451 బిలియన్ డాలర్ల మేర ఉందని, అంతర్జాతీయ లెక్కలను బట్టి చూసినా ఆదాయ వృద్ధిలో భారత్‌ది ఎనిమిదో స్థానమని తెలిపింది. భారతదేశంలో ఆదాయం పెరుగుతున్నా అది కొందరికి మాత్రమే పరిమితమవుతోందని, ఆ వృద్ధిలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావడం లేదని వెల్లడించింది. ఇప్పటికీ కూడా భారతదేశంలో గణనీయ స్థాయిలోనే పేదరికమూ ఉందని ఈ నివేదిక బయటపెట్టింది. దేశ జనాభాలో 42 లక్షల మంది నికర విలువ కేవలం లక్ష డాలర్లు మాత్రమేనని ఇది మొత్తం జనాభాలో 0.5 శాతమేనని వివరించింది. భారతదేశంలో వ్యక్తిగత ఆస్తులపై పేదరిక ప్రభావం తీవ్రంగా ఉందని తెలిపింది. మొత్తం స్థూల ఆస్తుల్లో వ్యక్తిగత అప్పులు 9 శాతం వరకు ఉన్నాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా సంపద 6.4 శాతం పెరిగిందని అంతర్జాతీయ సంపద నివేదిక వెల్లడించింది. 2012 నుంచి ఇంత వేగంగా పెరగడం ఇదే మొదటిసారని తెలిపింది. ఆర్థికేతర ఆస్తులు, ఈక్విటీ మార్కెట్లు భారీగా విస్తరించడమే సంపద వేగంగా పెరగడానికి ప్రధానంగా కారణమైందని తెలిపింది. అంతర్జాతీయ లెక్కలను బట్టి చూస్తే స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమనీ, అక్కడి తలసరి ఆస్తి 5,37,600 డాలర్లని తెలిపింది. ద్వితీయ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా జనాభా తలసరి ఆస్తి 4,02,600 డాలర్లని, అలాగే అమెరికా జనాభా తలసరి ఆస్తి 3,88,000 డాలర్లని వివరించింది.