బిజినెస్

నవ్యాంధ్రలో కొరియన్ టూరిజం సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 15: కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనతికాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షిస్తోందని కొరియన్ కాన్సులేట్ జనరల్ హంగ్‌తాయ్ కిమ్ అన్నారు. కొరియా దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు అవినాభావ సంబంధాలున్నాయని, త్వరలో నవ్యాంధ్రకు కొరియన్ల పర్యాటక బృందాలు వెల్లువెత్తుతాయని కిమ్ అన్నారు. ఏపీ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొరియన్ కాన్సులేట్ బృందం బుధవారం టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియను వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా హంగ్‌తాయ్‌కు మంత్రి హార్థిక స్వాగతం పలికారు. తమ దేశానికి చెందిన కొరియన్ టూరిజం సంస్థ (కెటిఓ) ఢిల్లీలో ఉందని, త్వరలో దీని శాఖను గుంటూరులో ప్రారంభిస్తున్నామన్నారు. దశాబ్దాల క్రితం కొరియన్ రాజు హు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పర్యటించారని తాయ్ వివరించారు. కొరియా దేశస్తులు ఎక్కువగా చైనాకు వెళుతుంటారని, ఇప్పుడు వారి దశ నవ్యాంధ్రప్రదేశ్ వైపు మారుతుందని చెప్పారు. అయిదోవంతు కొరియన్లు బౌద్ధ మతస్థులని, నవ్యాంధ్ర రాజధాని అమరావతి సందర్శనకు వారంతా ఆసక్తిగా ఉన్నారన్నారు. ఏపీలో పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, బుద్ధుడు నడయాడిన ఈ ప్రాంతానికి కొరియన్ పర్యాటకులను మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నామని మంత్రి అఖిలప్రియ చెప్పారు. తెలుగు భాష, సంస్కృతి గొప్పదనాన్ని కొరియన్ కాన్సులేట్ జనరల్‌కు వివరించారు. కొరియన్ బృందానికి ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఎడి డాక్టర్ ఎఎం శిరీష్, బాలాజీ చంద్రరావు సారథ్యం వహించారు.