బిజినెస్

నిధులెలా సేకరిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: నిధుల సమీకరణకు, ప్రధాన కార్యకలాపాలను బలోపేతం చేయడానికి బోర్డు ఆమోదించిన రోడ్‌మ్యాప్‌లను నెల రోజులలోగా సమర్పించాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 2.11 లక్షల కోట్ల మూలనిధిని సమకూర్చే కసరత్తులో భాగంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. మితిమీరిన నిరర్ధక ఆస్తుల భారంతో కుంగిపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థికంగా ఊతమివ్వడానికి కేంద్రం రూ. 2.11 లక్షల కోట్ల మూలనిధిని రెండు సంవత్సరాల కాలంలో సమకూర్చనున్నట్టు గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్యాకేజీలో రీక్యాపిటలైజేషన్ బాండ్లు, బడ్జెట్మ్రైన మద్దతు, ఈక్విటీ డైల్యూషన్ వంటివి ఉన్నాయి. బ్యాంకులు కూడా తమ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నారు. ప్రభుత్వం మూలధన సాయాన్ని అందచేయడానికన్నా చాలా ముందే సుమారు నెల రోజుల్లోగానే బ్యాంకులు భవిష్యత్తులో ఏయే రంగాలపై కేంద్రీకరించాలో ఆయా బ్యాంకుల బోర్డులు నిర్ణయించాలని ఆయన అన్నారు. బ్యాంకులు తమ పోర్ట్ఫోలియోలు, నిరర్ధక ఆస్తులు, ప్రధానేతర కార్యకలాపాలు, మార్కెట్ నుంచి నిధుల సేకరణ, ప్రధాన యోగ్యతలపై కేంద్రీకరించాలని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం అందజేసే నిధులను మెరుగయిన రీతిలో ఉపయోగించుకోవడానికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. పాడు రుణాల బారిన పడిన బ్యాంకుల మూలధన స్థాయిని పెంచడానికి ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలో రూ. 1.35 లక్షల కోట్లను రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో, రూ. 18,100 కోట్లను బడ్జెట్ పరమైన మద్దతు ద్వారా, రూ. 58వేల కోట్లను మార్కెట్ నుంచి అందించే ప్యాకేజీని ప్రకటించింది. 2015 మార్చిలో రూ. 2.78 లక్షల కోట్లు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) 2017 జూన్ నాటికి రూ. 7.33 లక్షల కోట్లకు పెరిగాయి. గత మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రభుత్వం రూ. 51వేల కోట్ల మూలనిధిని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సమకూర్చింది. నిరర్ధక ఆస్తుల భారం కారణంగా గత కొన్ని నెలలుగా బ్యాంకుల కీలక కార్యకలాపమైన రుణాల అందజేతలో ఎలాంటి వృద్ధి లేకుండా పోయింది.
అయితే ప్రభుత్వం తాజాగా ప్రకటించిన రూ. 2.11 లక్షల కోట్ల మూలనిధి ప్యాకేజీ వల్ల బ్యాంకులు ఇచ్చే రుణాలలో వృద్ధి చోటు చేసుకుంటుందని భావిస్తున్నారు.