బిజినెస్

‘ప్యాకేజింగ్ రంగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, నవంబర్ 15: ప్యాకేజింగ్ రంగాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వరల్డ్ ప్యాకేజింగ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుపిఓ) నూతన అంబాసిడర్‌గా నియమితులైన చక్రవర్తి అన్నారు. బుధవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వస్తువుల ఉత్పత్తి ఎంత ముఖ్యమో వాటిని భద్రంగా ప్యాకింగ్ చేయడం అంతే ముఖ్యమని అన్నారు. ప్యాకేజింగ్‌లోని లోపాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఈ అంశంపై అంతర్జాతీయంగా పనిచేస్తున్న డబ్ల్యుపిఓ సంస్థ తనను అంబాసిడర్‌గా ఎన్నుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఆహార పదార్థాలను చాలాకాలంపాటు చెడిపోకుండా కాపాడగలిగితే ప్రపంచ వ్యాప్తంగా ఆహారం అందక చనిపోతున్న వారిని రక్షించగలుగుతామన్నదే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశమని అన్నారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని నిత్యం ఈ రంగంలో పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎంతో ఆహారం వృథా అవుతుందని, పేద దేశాల్లో ఆకలి చావులు కొనసాగుతూనే ఉన్నాయని ఇలాంటి వారిని నిరోధించేందుకు ఇవి ఎంతగానో తోడ్పడనున్నాయని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో పర్యటిస్తూ ప్యాకేజింగ్ యొక్క ప్రాధాన్యతను వివరించనున్నట్టు చెప్పారు.