బిజినెస్

క్యూ-3లో 92 లక్షల స్మార్ట్ఫోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: దేశీయ స్మార్ట్ఫోన్ల మార్కెట్‌లో దూసుకెళ్తున్న చైనా సంస్థ షియోమీ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 9.2 మిలియన్ల మొబైల్ ఫోన్లను విక్రయించింది. దీంతో స్మార్ట్ఫోన్ల మార్కెటల్లో 23.5 శాతం సాధించినట్లు ప్రకటించింది. షియోమీ వైస్‌ప్రెసిడెంట్, ఎండి మాను జైన్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడాదికి ఏడాది స్మార్ట్ఫోన్ల విక్రయంలో దేశ వ్యాప్తంగా దాదాపు 300 శాతం విక్రయాలు పెంచుకుంటూ దూసుకుపోతున్నట్లు తెలిపారు. ప్రతి ఐదు స్మార్ట్ఫోన్ల వినియోగంలో మూడు రెడ్ మి నోట్ 4, రెడ్ మి 4, రెడ్ మి 4ఎ ఫోన్లు కలిగి ఉన్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారా స్మార్ట్ఫోన్ విక్రయాల్లో కూడా 51 శాతం మార్కెట్ భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. 2014 జులైలో భారత్‌లో ప్రవేశించిన షియోమీ స్మార్ట్ఫోన్ల తయారీలో అంచలెంచలుగా ఎదుగుతూ రెడ్ మి సిరీస్ ద్వారా అగ్రభాగానికి చేరుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న రికార్డు పరిశీలిస్తే సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 19 వరకు నాలుగు మిలియన్ యూనిట్లు విక్రయించినట్లు తెలిపారు.