బిజినెస్

రక్షణ విభాగాల అభివృద్ధికి టెక్నాలజీ ఫండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: కేంద్ర ప్రభుత్వం అన్ని శాఖల కన్నా రక్షణ శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆ శాఖ శాస్ర్తియ సలహాదారు, డైరక్టర్ జనరల్ (ఎంఎస్‌ఎస్) డాక్టర్ జి.సతీష్‌రెడ్డి అన్నారు. రక్షణ శాఖలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు, కొత్త సాంకేతిక వ్యవస్థలను అభివృద్ధి చేసేందుకు గాను ‘టెక్నాలజీ డెవలెప్‌మెంట్ ఫండ్’ను ఏర్పాటు చేసిందని తెలిపారు. తద్వారా రక్షణ, ఎయిరోస్పేస్ రంగాల్లో తగిన సహాయ సహకారాలను పొందవచ్చని వెల్లడించారు. రక్షణ శాఖకు అనుబంధంగా ఉన్న అనేక కంపెనీలు కూడా ఈ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయని అన్నారు. గురువారం నాడిక్కడ భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తెలంగాణ యూనిట్ ఆధ్వర్యంలో ‘తెలంగాణలో రక్షణ, ఎయిరోస్పేస్ సెక్టార్’ వృద్ధి అనే అంశంపై జరిగిన సదస్సుకు సతీష్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్షణ రంగానికి అనుబంధంగా ఉన్న పరిశ్రమల్లో ఎంతైతే నాణ్యతతో కూడిన ఎగుమతి సామర్ధ్యం పెరుగుతుంతో అంతే స్థాయిలో తగిన ఆర్డర్లు పొందేందుకు వీలుంటుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగాల్లో విస్తత్రం కాని మార్కెట్లతో రక్షణ అనుబంధ పరిశ్రమలు అవగాహన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఈ సదస్సులో సిఐఐ తెలంగాణ చైర్మన్ వి.రాజన్న స్వాగతోపన్యాసం చేశారు. దేశ రక్షణ, ఎయిరోస్పేస్ రంగాల్లో ఉన్న మార్కెట్లో తెలంగాణ రాష్ట్రం 15 నుంచి 20 శాతం వాటా సాధించే దిశగా పని చేస్తోందని రాజన్న అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన టిఎస్‌ఐపాస్ విధానం ద్వారా ఎయిరోస్పేస్ పార్కులో తమ యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చే వారికి త్వరగా అనుమతులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ సదస్సులో ఆర్మీకి చెందిన పలు విభాగాల అధిపతులు పాల్గొని తమ సలహాలు, సూచనలు అందజేశారు.

చిత్రం..హైదరాబాద్‌లో సోమవారం సీఐఐ తెలంగాణ యూనిట్ నిర్వహించిన
సదస్సుకు హాజరైన సతీష్‌రెడ్డి తదితరులు