బిజినెస్

పుంజుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 16: గత మూడు రోజులుగా ప్రతికూల పరిణామాలతో మందకొడిగా సాగిన మార్కెట్ గురువారం భారీగా పుంజుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించిన షేర్లు బాగా లాభపడటంతో బిఎస్‌ఇ సెనె్సక్స్ ప్రోత్సాహకర వాతావరణంలో 346 పాయింట్లు పెరిగి మళ్లీ 33 వేల పాయింట్ల మార్కును అధిగమించింది. అలాగే ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ కూడా 96.70 పాయింట్లు లాభపడి 10,214.75 పాయింట్లకు చేరుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి సెనె్సక్, నిఫ్టీ ఇంత భారీగా పుంజుకోవడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో ఒక్కసారిగా పరిస్థితులు సానుకూలంగా మారాయి. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ షేర్లు బాగా లాభపడ్డాయి. బ్యాంకులకు ఊతాన్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఉద్దీపనల పథకంతో ఈ రంగానికి చెందిన షేర్లు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నాయి. నేటి లావాదేవీల్లో ఇన్ఫోసిస్ షేరు విలువ 3.85 శాతం పెరిగింది. అలాగే ఎస్‌బిఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్‌టిపిసి, టిసిఎస్ షేర్లు కూడా పుంజుకున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్ల కొనుగోళ్లు భారీగా జరిగాయి.