బిజినెస్

విజయ్ మాల్యాపై సెబీ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 16: దేశంలోని వివిధ బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాపై సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కొరడా ఝళిపించింది. ఆయన నేతృత్వంలోని యూబీహెచ్‌ఎల్ (యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్ లిమిటెడ్) నుంచి రూ.18.5 లక్షల బకాయిలను రాబట్టేందుకు ఆ సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలతో పాటు డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్ ఖాతాలను జప్తు చేయాలని మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ గురువారం అధికారులను ఆదేశించింది. యూబీహెచ్‌ఎల్‌కు 2015లో విధించిన జరిమానాను చెల్లించడంలో ఆ సంస్థ విఫలమవడంతో సెబీ ఈ నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ స్పిరిట్స్ సంస్థ షేర్లకు సంబంధించిన కొన్ని రకాల లావాదేవీల వివరాలను వెల్లడించకపోవడంతో సెబీ 2015లో ఆ సంస్థకు రూ.15 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాపై రూ.3.5 లక్షల వడ్డీ, రికవరీ వ్యయం రూ.1000 కలిపి ఆ సంస్థ చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.18.5 లక్షలకు చేరుకున్నాయి. దీంతో యూబీహెచ్‌ఎల్‌కు చెందిన ఖాతాల నుంచి ఎటువంటి చెల్లింపులను అనుమతించవద్దని సెబీ ఈ నెల 13వ తేదీన జారీ చేసిన జప్తు నోటీసులో బ్యాంకులు, డిపాజిటరీలు, మ్యూచువల్ ఫండ్ సంస్థలను ఆదేశించింది.