బిజినెస్

సరుకులపై కొత్త రేట్ల ముద్రణకు మరింత వెసులుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: కొద్ది రోజుల క్రితం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోని దాదాపు 200 వస్తువుల రేట్లను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం తాజా ధరలతో కూడిన స్టిక్కర్లను ఆయా వస్తువులపై అతికించేందుకు సదరు కంపెనీలకు డిసెంబర్ నెలాఖరు వరకు అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి జీఎస్‌టీని అమలులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం, సరుకులపై పాత రేట్లను తొలగించి వాటి స్థానంలో సెప్టెంబర్ నెలాఖరులోగా కొత్త రేట్లతో కూడిన స్టిక్కర్లను అతికించాలని గతంలో కంపెనీలకు స్పష్టం చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఈ గడువును ప్రభుత్వం డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించింది. సరుకులపై కొత్త ఎమ్మార్పీ ధరలతో కూడిన స్టిక్కర్లను ముద్రించేందుకు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ సరుకులు)-2011 నిబంధనల ప్రకారం అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. వస్తు, సేవల పన్ను పరిధిలోని కొన్ని సరుకుల ధరలను మరింత తగ్గించినందున ఆయా వస్తువులపై సదరు కంపెనీలు కొత్త రేట్లతో కూడిన స్టిక్కర్లను ముద్రించేందుకు వీలుగా మరింత గడువు ఇచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు.