బిజినెస్

ఇప్పుడు ఏమంటారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 17: అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘మూడీస్’ 13 ఏళ్ల తర్వాత భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను బీబీఏ-3 నుంచి బీబీఏ-3కి పెంచడం పట్ల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన ఆర్థిక, సంస్థాగత సంస్కరణలకు లభించిన విశిష్టమైన గుర్తింపుగా ఆయన దీనిని అభివర్ణించారు. దీనిని ఆసరాగా చేసుకుని దేశంలో సంస్కరణల ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్తామని, వౌలిక వసతుల అభివృద్ధితో పాటు గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి చేస్తున్న ఖర్చును భారీగా పెంచుతామని జైట్లీ ప్రకటించారు. అలాగే దేశంలో ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించి, ద్రవ్య స్థిరీకరణకు మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేశారు. ‘గత కొనే్నళ్లుగా భారత్ చేపడుతున్న సానుకూల చర్యలను ఆలస్యంగా గుర్తించారు. ఇది అంతర్జాతీయ గుర్తింపు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది మనకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ), ఆధార్ అమలు లాంటి కీలక నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను క్రమబద్దీకరించడంతో పాటు డిజిటలైజేషన్ వైపు మళ్లించగలిగామని, దీనిని యావత్ ప్రపంచ గుర్తించిందని అరుణ్ జైట్లీ పేర్కొంటూ, దేశంలో చేపట్టిన సంస్కరణలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నవారు విమర్శలను కట్టిపెట్టి ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
పలువురు ప్రముఖుల హర్షం
కాగా, మూడీస్ ప్రకటన పట్ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న విశేష కృషి, సంస్కరణల ఫలితంగానే మూడీస్ మన దేశ క్రెడిట్ సావరిన్ రేటింగ్‌ను పెంచిందని అమిత్ షా పేర్కొన్నారు. వ్యాపారానికి అనుకూలమైన దేశాల జాబితాలో మన దేశ ర్యాంకు మెరుగుపడటం మోదీ కృషి ఫలితమేనని, అందుకే ఆయనను ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నట్లు వివిధ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని అమిత్ షా తెలిపారు. కేంద్ర న్యాయ, ఐటి శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్, రైల్వే, బొగ్గు గనుల శాఖల మంత్రి పియూష్ గోయల్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్, సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) చైర్మన్ అజయ్ త్యాగి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎండీ, సిఈఓ చందా కొచ్చర్, ఫిక్కీ (్భరత వాణిజ్య, పారిశ్రామిక మండళ్ల సమాఖ్య) ప్రెసిడెంట్ పంకజ్ పటేల్, అసోచామ్ ప్రధాన కార్యదర్శి డీఎస్.రావత్, సీఐఐ (్భరత పరిశ్రమల సమాఖ్య) డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ తదితరులు కూడా మూడీస్ ప్రకటన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, సంస్కరణల వేగాన్ని పెంపొందించి ప్రజలకు మరింత మెరుగైన పరిపాలనను అందించేందుకు మూడీస్ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని వారు స్పష్టం చేశారు.