బిజినెస్

హెరిటేజ్ ఫుడ్స్‌కు 3 అవార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ హెరిటేజ్ ఫుడ్స్‌కు మూడు అవార్డుల లభించాయి. ఇటీవల న్యూ ఢిల్లీలో జరిగిన గ్రే ట్ ఇండియా ఐస్‌క్రీం అండ్ ఫ్రోజెన్ డెసర్ట్ కంటెస్ట్ 2017లో మూడు విభాగాల్లో అవార్డులు లభించాయి. స్టాండర్ట్ వెనీలా కేటగిరిలో సిల్వర్, చాకోలెట్ కేటగిరిలో సిల్వర్, సోర్బెట్ కేటగిరిలో సిల్వర్ అవార్డులు లభించినట్లు హెరిటేజ్ ఫుడ్స్ తెలిపింది. దీంతో పాటు కంపెనీకి మరో అవార్డు లభించింది. తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డ్ 2017 కూడా సొంతం చేసుకుంది. ఈ అవార్డును శనివారం నాడిక్కడ జరిగిన కార్యక్రమంలో హెరిటేజ్ సిఎఫ్‌ఓ ఎ.ప్రభాకర నాయుడు స్వీకరించారు. ఐస్‌క్రీం విభాగంలో మూడు అవార్డులు రావడం పట్ల ఆ సంస్థ ఎండి నారా భువనేశ్వరి సిబ్బందికి అభినందనలు తెలిపారు. అవార్డు స్వీకరించిన సిఎఫ్‌ఓకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవార్డులు హెరిటేజ్ ఫుడ్స్‌కు లభించడం సంతోషంగా ఉందని, తమ కంపెనీ బలోపేతానికి ఇవి మరింత తోడ్పడతాయని భువనేశ్వరి పేర్కొన్నారు.