బిజినెస్

ఇంతలోనే.. అంత ప్రేమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 18: దేశాలకు క్రెడిట్ రేటింగ్‌లు ఇచ్చే విషయంలో అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ పాటిస్తున్న పద్ధతులన్నీ తప్పుల తడకగా ఉన్నాయంటూ కొద్ది నెలల క్రితం తీవ్రస్థాయిలో విమర్శించిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు అదే సంస్థ భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను పెంచడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం పరిహసించారు. ‘మూడీస్ పద్ధతులన్నీ తప్పుల తడకగా ఉన్నాయని మోదీ ప్రభుత్వం కొద్ది నెలల విమర్శించింది. ఈ పద్ధతులను ప్రశ్నించడంతో పాటు వాటిని సవరించాలని పేర్కొంటూ శక్తికాంత దాస్ (కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి) అప్పట్లో మూడీస్‌కు సుదీర్ఘమైన లేఖ రాశారు. ఇప్పుడు అదే సంస్థ భారత క్రెడిట్ సావరిన్ రేటింగ్‌ను పెంచడం పట్ల మోదీ సర్కారు ఉబ్బితబ్బిబ్బు అవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని చిదంబరం శనివారం ముంబయిలో పేర్కొన్నారు.