బిజినెస్

భ్రమల్లో పడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, నవంబర్ 18: దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల నుంచి బయటపడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం తప్పుడు భ్రమల్లో చిక్కుకోరాదని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హెచ్చరించారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ‘మూడీస్’ భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను పెంచడంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక, సంస్థాగత సంస్కరణలు దేశంలో పెరుగుతున్న పెట్టుబడులను స్థిరీకరించేందుకు దోహదపడతాయని మూడీస్ పేర్కొంటూ భారత సావరిన్ రేటింగ్‌ను సానుకూల స్థాయి అయిన ‘బీఏఏ-2’ నుంచి స్థిరత్వ స్థాయి అయిన ‘బీఏఏ-2’కి పెంచిన విషయం విదితమే. దీనిపై అడిగిన ఒక ప్రశ్నకు మన్మోహన్ సింగ్ సమాధానమిస్తూ, మూడీస్ చేయాల్సింది ఏదో చేసిందని, అంతమాత్రాన దేశ ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల నుంచి గట్టెక్కిందని మనం భావించరాదని, ఈ విషయంలో మోదీ ప్రభుత్వం తప్పుడు భ్రమల్లోకి జారుకుంటున్నట్లు అనిపిస్తోందని అన్నారు. ‘్భరత్‌లో స్థూల ఆర్థిక పరిణామాలు: విధానపరమైన దృక్కోణాలు’ అనే అంశంపై ఎర్నాకుళంలోని సెయింట్ థెరిస్సా కళాశాల ఆర్థికశాస్త్ర విభాగం ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు సందర్భంగా మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, దేశాన్ని 8 నుంచి 10 శాతం వృద్ధిరేటు సాధించే దిశగా నడిపించాలని కోరుకుంటున్నట్లు మోదీ ప్రభుత్వం చెబుతోందని, ఇది జరగాలంటే ఆర్థిక వ్యవస్థకు బలమైన కార్యదక్షతతో కూడిన మార్గదర్శకత్వం అవసరమని స్పష్టం చేశారు. మూడీస్ శుక్రవారం భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను బీఏఏ-3 నుంచి బీఏఏ-2కి పెంచడాన్ని దేశంలో చేపట్టిన సంస్కరణలకు ‘ఆలస్యంగా ఇచ్చిన గుర్తింపు’గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభివర్ణించిన నేపథ్యంలో మన్మోహన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయవచ్చని ఆయన హెచ్చరించారు. ‘కొద్ది నెలల క్రితం 40 నుంచి 45 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడి చమురు ధర ఇప్పుడు 62 నుంచి 64 డాలర్లు పలుకుతోంది. ఇది చెల్లింపుల్లో సమతూకాన్ని దెబ్బతీయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థకు కూడా విఘాతాన్ని కలిగించగలదు’ అని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.