బిజినెస్

బెస్తలే చేపలు అమ్ముకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ రూరల్, నవంబర్ 19: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసమే ప్రభుత్వం నీలి విప్లవం కార్యక్రమం కింద ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసిందని, పెరిగిన చేపలను అమ్ముకునే హక్కు కేవలం మత్స్యకారులకు మాత్రమే ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం పాత బాన్సువాడలో బోయి సంఘం కమ్యూనిటీ హాలును ప్రారంభించిన అనంతరం ఆయన వారినుద్దేసించి ప్రసంగించారు. మత్స్యకారులను మోసం చేసేందుకు చేపల కొనుగోళ్లకు వచ్చే దళారులను కచ్చితంగా జైలుకు పంపించి తీరుతామని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యానికి మత్సకారులు సహకరించాలని, దళారులను ఆశ్రయించి దగాపడొద్దని సూచించారు. ఏళ్ల కాలంగా దళారులను నమ్మిన మత్స్యకారులు ఆర్థికంగా బక్కచిక్కి పోగా దళారులు మాత్రం బాగా బలిసిపోయారని మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈసారి ఆలాంటి పరిస్థితులకు తావిచ్చేది లేదని, చేపల అమ్మకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. కామారెడ్డి జిల్లాలో 2 కోట్ల 31 లక్షల చేప పిల్లలను వేశారని, నిజామాబాద్ జిల్లాలో 3 కోట్ల 51లక్షల చేప పిల్లలను చెరువుల్లో వేసినట్టు మంత్రి వివరించారు. ఆ చేపలు మరోనాలుగైదు నెలల్లో అమ్ముకునే దశకు చేరుకుంటాయని, వాటిని అమ్మితే ప్రభుత్వ అంచనా ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మత్స్యకారులకు కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరనుందన్నారు. ఇక్కడి చేపలను కోల్‌కతాలాంటి దూర ప్రాంతాలకు ఎగుమతి చేయాలన్న మత్స్యకారులకు 16 లక్షల రూపాయల విలువ చేసే ఏసీ వాహనాన్ని ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాబోయి సంఘం అధ్యక్షుడు సాయిలు, అంజిరెడ్డి, సర్పంచ్ వాణి, జంగం గంగాధర్, ఎజాజ్ ఉన్నారు.

చిత్రం..బాన్సువాడలో మత్స్యకారుల భవనాన్ని ప్రారంభించిన అనంతరం
ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతున్న తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి