బిజినెస్

గిరిజనులకు నేరుగా సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, నవంబర్ 19: నాటుసారా తయారు చేసే వృత్తిని మానివేసిన గిరిజనులకు ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్ కింద ఆర్థిక సహాయం అందించటంలో బ్యాంకర్లు విఫలమవుతున్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని చెప్పారు. ఈఎస్‌ఎస్ పథకం కింద ఇచ్చే ఆర్థిక సహాయంలో ఎనభైశాతం రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుండగా, కేవలం 20శాతం మాత్రమే బ్యాంకులు రుణాలుగా ఇవ్వవలిసి ఉందని, కానీ ఈ మొత్తాన్ని కూడా మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకు రావటం లేదని అన్నారు. ఆదివారం విలేఖరుల సమావేశంలో ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ గతంలో రాష్ట్రాన్ని పాలించిన నాయకులు ఎన్నికల సమయంలో గిరిజన తండాలు, గూడేలు, చెంచుపెంటలలోని కుటుంబాలకు విద్యుత్ బిల్లుల కట్టవలసిన అవసరం లేదని, తాము అధికారంలోకి వస్తే విద్యుత్ బకాయిలు మాఫీ చేస్తామని ప్రకటించినా ఆచరణలో విఫలమయ్యాయని తెలిపారు. దీనివల్ల విజిలెన్స్ అధికారులు దాడులు జరిపి అక్రమ విద్యుత్ కనెక్షన్ల పేరిట విద్యుత్ కనెక్షన్లు తొలగించటమే కాకుండా గిరిజనులపై కేసులు నమోదు చేయటంతో గిరిజనులు కోర్టుల చుట్టూ తిరగటం, జైళ్లపాలవటం జరిగిందని అన్నారు. కొన్నిచోట్ల విద్యుత్ లైన్లకు నేరుగా కనెక్షన్లు తీసుకున్న కారణంగా విద్యుత్ ప్రమాదాల్లో కొందరు గిరిజనులు మరణించిన సంఘటనలు కూడా ఉన్నాయని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని రాష్టవ్య్రాప్తంగా గిరిజన కుటుంబాలకు సంబంధించిన 71కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలను మాఫీ చేస్తు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు 125 రూపాయలు చెల్లించి విద్యుత్ కనెక్షన్లు రెగ్యులర్ చేసుకోవాలని, దీనివల్ల ప్రభుత్వం ఒక ఎల్‌ఇడి విద్యుత్ బల్బు, ఒక ఎల్‌ఇడి ఫ్యాన్, నెలకు 50యూనిట్ల ఉచిత విద్యుత్ అందచేస్తుందని తెలిపారు. లేనిపక్షంలో పాత బకాయిలు చెల్లించటంతోపాటు కేసులలో శిక్ష అనుభవించవలసి ఉంటుందని స్పష్టం చేసారు. ఈ విషయంలో ఆయా ప్రాంతాలకు చెందిన గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులు తగిన బాధ్యతలు తీసుకోవాలని కోరారు. దీనికితోడు రాష్ట్రంలోని గిరిజన జనాభా అధికంగా ఉన్న ఆరు పాత జిల్లాల్లో గిరిజన గ్రామాల నుంచి గ్రామపంచాయతీలకు, గ్రామపంచాయతీల నుంచి మండల కేంద్రాలకు రోడ్డు కనెక్ష్టివిటీని పెంచేందుకు ఐదువందల కోట్ల రూపాయలు మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. గిరిజను విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై పూర్తిస్థాయిలో సర్వే జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని సూచిస్తు తనకు, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన గిరిజనులకు పోడుభూములపై పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసారని తెలిపారు. విలేకరుల సమావేశంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ చైర్మన్ గాంధీనాయక్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..వరంగల్‌లో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపి సీతారాంనాయక్