బిజినెస్

అడిగింది మిగులు నిధులనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక డివిడెండ్ చెల్లించాలని రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ)ను అడగడం లేదని, కేవలం ఆర్‌బీఐ వద్ద అదనంగా ఉన్న రూ. 13వేల కోట్లను ఇవ్వాలని మాత్రమే అడుగుతోందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ తెలిపారు. 2017 జూన్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ ఆగస్టులో ప్రభుత్వానికి రూ. 30,659 కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఆర్‌బీఐ 2015-16 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన రూ. 65,876 కోట్ల డివిడెండ్‌తో పోలిస్తే ఈ మొత్తం సగానికన్నా తక్కువే. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌లో ఆర్‌బీఐ నుంచి రూ. 58వేల కోట్లు డివిడెండ్ రూపంలో వస్తాయని పేర్కొంది. ఆర్‌బీఐ నుంచి ప్రత్యేక డివిడెండ్‌ను అడగాలనే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం లేదని, ఆర్‌బీఐ ఈ సంవత్సరం ఆర్జించిన లాభాన్ని ఇంకా పంపిణీ చేయలేదని, దాని గురించి అడగాలని మాత్రమే చర్చించడం జరిగిందని సుభాశ్ చంద్ర గార్గ్ తెలిపారు. ఇది సుమారు రూ. 13వేల కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని తనకు బదిలీ చేయాలని ప్రభుత్వం ఆర్‌బీఐకి సూచించిందని ఆయన ఒక వార్తాసంస్థ ప్రతినిధికి చెప్పారు. ఆర్‌బీఐ ఆర్జించిన లాభం సుమారు రూ. 44వేల కోట్లు ఉంటుందని, ఇందులో రూ. 30వేల కోట్లు పంపిణీ చేసిందని, మిగతా రూ. 13వేల కోట్లను రిస్క్స్ అండ్ రిజర్వ్స్ కోసం తన వద్దే ఉంచుకుందని ఆయన తెలిపారు. అయితే ఈ మిగిలిన రూ. 13వేల కోట్లను కూడా పంపిణీ చేయొచ్చని ప్రభుత్వం సూచించిందని ఆయన పేర్కొన్నారు. నిరర్థక ఆస్తుల భారంతో కుంగిపోతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థికంగా ఊతాన్ని ఇవ్వడానికి రూ. 2.11 లక్షల కోట్ల మూలధనాన్ని అందజేయనున్నట్టు ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మొత్తంలో భాగంగా విడుదల చేయనున్న రీక్యాపిటలైజేషన్ బాండ్ల వివరాల గురించి అడగ్గా, ‘రీక్యాపిటలైజేషన్ ప్యాకేజీ తుది దశలో ఉంది. ఆర్థిక సేవల విభాగం ఈ ప్యాకేజీపై కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలను మనం తెలుసుకోగలం’ అని ఆయన బదులిచ్చారు. మొత్తం 2.11 లక్షల కోట్లలో రూ. 1.35 లక్షల కోట్లను రీక్యాపిటలైజేషన్ బాండ్ల ద్వారా, మిగతా 76వేల కోట్లను బడ్జెట్ పరమైన మద్దతు, క్యాపిటల్ మార్కెట్‌లో బ్యాంకుల వాటాలను విక్రయించడం ద్వారా సమకూర్చనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

చిత్రం..సుభాశ్ చంద్ర గార్గ్