బిజినెస్

బడ్జెట్ లోటు పెరగొచ్చు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: తక్కువ పన్నులు, ఎక్కువ ప్రభుత్వ వ్యయం కారణంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ లోటు పెరుగుతుందని అమెరికాకు చెందిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. అయితే పన్ను చెల్లించేవారి సంఖ్యను విస్తరించడంతో పాటు వ్యయ సమర్థతను మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా రానున్న కాలంలో బడ్జెట్ లోటు తగ్గుతుందని వివరించింది. ఆర్థిక పరిస్థితిని దృఢతరం చేయడానికి, స్థిరమైన వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉండటం వల్ల రుణాల భారం తగ్గుతుందని మూడీస్ భావిస్తున్నట్టు ఆ సంస్థ ఇనె్వస్టర్స్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ (సావరిన్ రిస్క్ గ్రూపు) విలియమ్ ఫోస్టర్ ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మూడీస్ గత 13 ఏళ్ల కాలంలో తొలిసారి గత వారం భారతదేశ సావరిన్ రేటింగ్‌ను పెంచిన విషయం తెలిసిందే. ఆర్థిక, సంస్థాగత సంస్కరణలు స్థిరంగా పురోగమించడం వల్ల దేశ వృద్ధి అవకాశాలు పెరిగాయని సావరిన్ రేటింగ్‌ను పెంచిన సందర్భంగా మూడీస్ పేర్కొంది. భారత సావరిన్ రేటింగ్‌ను బీఏఏ3 స్థాయి నుంచి బీఏఏ2 స్థాయికి పెంచింది. రేటింగ్ ఔట్‌లుక్‌ను ‘సానుకూలం’ నుంచి ‘నిలకడయిన’కు మార్చింది. కొనసాగుతున్న ఆర్థిక, సంస్థాగత సంస్కరణల పురోగతి భారత అధిక వృద్ధి రేటు అవకాశాలను పెంచుతాయనే అంశాన్ని పెరిగిన సావరిన్ రేటు ప్రతిబింబిస్తోందని ఫోస్టర్ పేర్కొన్నారు. భారత రుణ, జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నిష్పత్తి ప్రస్తుతం 68.6 శాతం ఉంది. 2023 నాటికి దీనిని 60 శాతం లోపునకు తగ్గించాలని ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ సిఫారసు చేసింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరం సాధారణ బడ్జెట్ లోటు జీడీపీలో 6.5 శాతం ఉంటుందని తాము అంచనా వేశామని ఫోస్టర్ తెలిపారు. అయితే పన్ను చెల్లించేవారి పరిధిని విస్తరించడానికి, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగు పరచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల తరువాత కాలంలో బడ్జెట్ లోటు తగ్గుతుందని తమ సంస్థ అంచనా వేసిందని ఆయన వివరించారు.