బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 31: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 57.64 పాయింట్లు పడిపోయి 26,667.96 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 18.40 పాయింట్లు దిగజారి 8,160.10 వద్ద నిలిచింది. హెల్త్‌కేర్, ఐటి, టెక్నాలజీ, ఎఫ్‌ఎమ్‌సిజి, చమురు, గ్యాస్, పవర్, క్యాపిటల్ గూడ్స్ రంగాల షేర్ల విలువ 1.39 శాతం నుంచి 0.67 శాతం వరకు క్షీణించింది. ఇదిలావుంటే మంగళవారంతో మే నెల ముగియగా, గడచిన ఈ మూడు నెలల్లోనూ స్టాక్ మార్కెట్లు లాభాల్లోనే కదలాడటం గమనార్హం. ఇక మే నెలలో సెనె్సక్స్ 1,061.34 పాయింట్లు పుంజుకోగా, నిఫ్టీ 310.30 పాయింట్లు లాభపడింది.