బిజినెస్

చేనేత కార్మికులకు హౌస్ కం వర్క్‌షెడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: రాష్ట్రంలో 50 ఏళ్లు దాటిన చేనేత కార్మికులందరికీ పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని, అందుకు వారు తక్షణం దరఖాస్తులు పెట్టుకోవచ్చునని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు తెలిపారు. ఖాళీ స్థలం అందుబాటులో లేనివారికోసం మూడు లక్షలు అంచనా వ్యయంతో హౌస్‌కం వర్క్‌షెడ్ నిర్మించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనగా తెలిపారు.
ప్రస్తుతం వర్క్‌షెడ్‌ను తమ గృహాలపై నిర్మించుకొనేందుకు ఇంటికోసం లక్షా 50 వేల రూపాయలు, షెడ్ నిమిత్తం మరో 75 వేలు సహాయం అందిస్తున్నామన్నారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాలలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి పైవిధంగా బదులిచ్చారు. సభ్యులు సూర్యనారాయణ మాట్లాడుతూ జి ప్లస్ త్రి ఇళ్లల్లో వర్క్‌షెడ్ ఏర్పాటు చేసుకోలేక చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎమ్మిగనూరు శాసనసభ్యుడు నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ అందరికీ ఇళ్లు నిర్మించాలన్నారు. పాత ఇళ్లల్లోని మగ్గాల్లో వర్షపునీరు చేరుతున్నదని అలాగే పడుగులు ఆరబెట్టుకోటానికి వెలుపల ఖాళీ స్థలాల్లో కూడా నీరు చేరుతున్నందున 60 రోజులపాటు పనులు ఉండటం లేదు.
మత్స్య కార్మికుల మాదిరిగా వీరికి కూడా కొంత ఆర్థిక సాయం అందించాలని కోరారు. వారి ఆర్థిక స్వావలంబన కోసం చేనేత కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. పిఠాపురం సభ్యుడు వర్మ మాట్లాడుతూ బాల కార్మిక చట్టం అంటూ పిల్లలు పనిచేయకుండా కార్మిక శాఖ అధికారులు వేధిస్తున్నందున వారందరినీ పాఠశాలలకు పంపించే ఏర్పాటు చేయాలన్నారు.
మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల రుణాలన్నీ మాఫీ చేశామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.