బిజినెస్

పెట్టుబడులకు ముందుకొచ్చిన మిత్సుబిషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 22: వ్యవసాయం, ఆహార శుద్ధి, పరికరాల లీజింగ్, విమానాశ్రయాల అభివృద్ధి, విద్యుత్ వాహనాలు, వాహనాల బ్యాటరీ ఉత్పత్త తదితర రంగాలపై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని మిత్సుబిషి కార్పొరేషన్ ఇండియా సీఎండీ ఇషుకే సుజుకి చెప్పారు. వ్యవసాయదారులకు నాణ్యమైన పురుగుమందులు, యంత్ర సామగ్రిని లీజు ప్రతిపాదనపై స్వయం సహాయక బృందాలకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు అందించేందుకు తగిన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో మిత్సుబిషి కార్పొరేషన్ ఇండియా ప్రతినిధుల బృందం ఇషుకే సుజకీ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సమావేశమై తమ ప్రతిపాదనలకు వివరించింది.
సేద్యపు అవసరాలకు డ్రోన్ ఆప్లికేషన్ ఉపయోగించుకోవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి వారితో చెప్పగా, ఈ ప్రాజెక్టుపై పని చేయడానికి మిత్సుబిషి ప్రతినిధులు ఆసక్తి చూపారు. భూసార పరీక్షలు, కాల్వల నిర్వహణ, ఇతర అవసరాలకు డ్రోన్లు వినియోగించే విధానంపై త్వరలో తగు ప్రతిపాదనలతో వస్తామని చెప్పారు. ఇంధన నిల్వ విధానంపై తాము సాధించిన ప్రగతిని వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. స్థిరమైన విద్యుత్ పంపిణీ కోసం టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్) కోసం అమెరికాకు చెందిన ఏఈఎస్ అనే సంస్థతో కలిసి సంయుక్తంగా అధునాతన ఇంథన నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేశామని వారు తెలిపారు. రాష్ట్రంలో ఇంథన నిల్వ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కృషి జరుగుతోందని, థర్మల్, జల, పవన, సౌరశక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, ఇదే సమయంలో విద్యుత్ నిల్వ చేసుకునే వ్యవస్థను పటిష్టపర్చుకో గలిగితే ఉత్పత్తి వ్వయం తగ్గి, సామర్ధ్యం పెరుగుతుందని చెప్పారు. విద్యుత్ నిల్వ కోసం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పద్ధతులను పరిశీలించి ఆయా సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపారు.
ఉత్తమ నిర్వహణ విధానాల ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలను 9 శాతానికి తగ్గించగలిగామని, దీనిని రెండు, మూడు శాతానికి తీసుకురావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. మిత్సుబిషి కార్పొరేషన్ ఇండియా డిప్యూటీ ప్లానింగ్ అండ్ కో ఆర్డినేషన్ ఆఫీసర్ షుహీ ఆండో, ఇసుజ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హితోషి కోనో ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.