బిజినెస్

నింగికెగిసిన వాణిజ్య లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 22: ఈ సంవత్సరం ఏప్రిల్- అక్టోబర్ మధ్య కాలంలో దేశ వాణిజ్య లోటు భారీగా పెరిగిపోయింది. నిరుడు ఇదే కాలంతో పోలిస్తే వాణిజ్య లోటు సుమారు 60 శాతం పెరిగి, 88 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఎగుమతుల వృద్ధి రేటు బలహీనపడి, దిగుమతులు భారీగా పెరగడం వల్లనే వాణిజ్య లోటు ఇంత భారీగా పెరిగిందని ఒక నివేదిక తెలిపింది. ‘్భరత వాణిజ్య లోటు విపరీతంగా పెరిగి పోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. నిరుడు ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్- అక్టోబర్ మధ్య కాలంలో ఎగుమతులు బలహీనంగా తొమ్మిది శాతం మాత్రమే వృద్ధి చెందాయి. రెండోది, దిగుమతులు మాత్రం నిరుటితో పోలిస్తే ఏకంగా 23 శాతం పెరిగాయి. దీంతో మొత్తం మీద వాణిజ్య లోటు 88 బిలియన్ డాలర్లకు పెరిగింది. నిరుడు ఇదే కాలంతో పోలిస్తే ఇది 60 శాతం ఎక్కువ’ అని సింగపూర్‌కు చెందిన బ్రోకరేజ్ సంస్థ డీబీఎస్ బుధవారం ఒక నివేదికలో పేర్కొంది. అయితే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు వల్ల తలెత్తిన సమస్యలు, గందరగోళ పరిస్థితులు సమసిపోతే ఎగుమతులు పుంజుకుంటాయని ఆ సంస్థ అంచనా వేసింది. ఎగుమతయ్యే వస్తువుల్లో ఉండే వైవిధ్యం కూడా ఈ సంవత్సరం ప్రాంతీయ ఎగుమతి వలయంలో సంభవించే వృద్ధినుంచి ఆర్థిక వ్యవస్థ లబ్ధి పొందకుండా అడ్డుకుందని పేర్కొంది. సెమీ కండక్టర్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ సహా ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతిలో ప్రధానంగా పెరుగుదల ఉందని, అయితే మొత్తం ఎగుమతుల్లో ఇవి పది శాతానికి లోపే ఉన్నాయని పేర్కొంది. ఎగుమతుల్లో మూడింట రెండు వంతులు రత్నాలు, నగలు, ఫార్మా, టెక్స్‌టైల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, ఆహారం, ఇంధనం వంటి సంప్రదాయ ఉత్పత్తి గ్రూపులు ఉన్నాయని పేర్కొంది.
ఇంకా, జీఎస్‌టీ సంబంధిత అనిశ్చితి కూడా ఎగుమతులకు ఆటంకంగా మారిందని తెలిపింది. మరోవైపు, దిగుమతులను పెరిగిన చమురు ధరలు ప్రభావితం చేశాయని పేర్కొంది. చమురు దిగుమతులు 20 శాతం పెరిగాయని, ఇవి నిరుడు ఇదే కాలంలో 12 శాతం మాత్రమే ఉన్నాయని ఆ నివేదిక వివరించింది. ఇతర సరుకులకు కూడా గట్టి డిమాండ్ ఉందని తెలిపింది.