బిజినెస్

దేశానికే తలమానికం పోలవరం జర్మన్ టెక్నాలజీతో నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 22: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అత్యంత నాణ్యతా ప్రమాణాలతో, విదేశీ టెక్నాలజీతో చేపట్టామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంపై ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ కాఫర్‌డాంకు అనుమతి మంజూరుకాలేదని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదన్నారు. అప్పర్ డ్యాం పనులను నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్‌తో పాటు పోలవరం అథారిటీలు పర్యవేక్షిస్తున్నా యన్నారు. స్పిల్‌వే, ఎర్త్‌కం రాక్, డయాఫ్రం వాల్ పనులు జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టామన్నారు. ఎస్కవేషన్ పనులు డిసెంబర్‌లో కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించి వచ్చే ఏడాది జూన్‌లోగా పనులు పూర్తిచేయాలని నిర్దేశిస్తామన్నారు. లోయర్ కాఫర్‌డ్యామ్ పనులు కెల్లార్ సంస్థ చేపట్టిందని తెలిపారు. స్పిల్‌వే కాంక్రీటు పనులు 4లక్షల క్యూబిక్ మీటర్ల మేర జరిగాయన్నారు. ప్రాజెక్టు ద్వారా 194 టీఎంసీలు, 50 లక్షల క్యూసెక్కుల మేర వినియోగించుకునే వీలు కలుగుతుందన్నారు. దేశం మొత్తంగా అత్యంత తక్కువ వ్యవధిలో నిర్మాణం పూర్తవుతున్నది పోలవరం ఒక్కటే అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి సోమవారం- పోలవరం అనే నినాదంతో అధికారులతో సమీక్ష జరపటంతో పాటు ఇప్పటి వరకు 20 సార్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించారని వివరించారు. వచ్చే ఏడాదికి గ్రావిటీతో నీరందించి 2019లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ హయాంలో ప్రీ క్లోజర్ పేరుతో టెండర్లు రద్దుచేసి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.