బిజినెస్

కొత్త జీవోలు.. అవే తప్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, నవంబర్ 22: గత ప్రభుత్వం ఏవైతే తప్పిదాలు చేసిందో అవే తప్పిదాలు పునరావృతమైనట్టుగా తాజాగా గృహ నిర్మాణంలో జారీ అయిన జీవోలను బట్టి తెలుస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, దాదాపు రూ.4500 కోట్ల మేర కుంభకోణం చోటుచేసుకుందని అధికార టిడిపి ఆరోపిస్తూ థర్డ్ పార్టీ ఎంక్వైరీలో తప్పులను బయటపెట్టింది. అపుడు ఏవైతే ప్రధాన తప్పిదాలుగా పేర్కొన్నారో, ఏ లోటుపాట్లవల్ల అవకతవకలు జరిగాయని గుర్తించారో అవే తప్పిదాలు పునరావృతం చేస్తున్నట్టుగా ఈనెల 10, 20వ తేదీన జారీ అయిన జీవోలు 10, 94ని బట్టి అర్ధమవుతోందని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 14 లక్షల ఇళ్ల నిర్మాణంలో సుమారు రూ.4500 కోట్లు కుంభకోణం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వాధినేతలు ఆరోపిస్తున్నారు. అప్పట్లో ప్రధానంగా జంట ఇళ్లను నిర్మించారని, ప్లింత్ ఏరియా నిబంధన తుంగలో తొక్కారని, రెండు యూనిట్లకు కలిపి మధ్య గోడ పెట్టి ఒకే ఇల్లు నిర్మించుకున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. థర్డ్ పార్టీ విచారణ కూడా పలుచోట్ల ఇంజినీరింగ్ విద్యార్థులకు అప్పగించారు. మధ్యలో గోడను చూసి రెండు ఇళ్లుగా బిల్లులు చేసేసిన తర్వాత తాత్కాలికంగా బలహీనంగా పెట్టిన గోడను తొలగించి ఒకే ఇల్లుగా వినియోగించుకునేవారు. దీనికి తోడు ఒక పట్టా వుంటే సాధారణంగా కుటుంబ సభ్యులుగానీ, వారి తాలూకు చుట్టాలుగానీ, ఆయా సామాజికవర్గ పొరుగుగానీ ఉంటుంది. కానీ గతంలో కట్టిన ఇళ్లల్లో ఒక పట్టా ఆసరా చేసుకుని ఆ పక్కన వున్న సంబంధం లేనివారి పట్టాకూడా ఏదో విధంగా కొనుగోలుచేసి, రెండేసి యూనిట్లను ఒకే ఇంటిగా నిర్మించుకున్న దాఖలాలున్నాయి. ఇపుడు తాజాగా జారీఅయిన జీవో 94ను బట్టి కూడా ఇటువంటి తప్పులే పునరావృతమయ్యే పరిస్థితులున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరీ విచిత్రమేమిటంటే కేంద్ర ప్రభుత్వ హౌసింగ్, ఎన్టీఆర్ గ్రామీణ్ పథకం మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ కేంద్ర పథకంలో 275 చదరపు అడుగుల ప్లింత్ ఏరియాలో ఇంటిని నిర్మించుకోవాల్సి వుంది. కానీ తాజాగా గత 10వ తేదీన జారీ అయిన జీవో నెంబర్ 10 ప్రకారం దానిని 750 చదరపు అడుగుల విస్తీర్ణానికి పెంపుదలచేశారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వ పథకంలోనూ, అటు కేంద్రం ఎన్టీఆర్ గ్రామీణ్ పథకంలో కూడా 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టుకోవచ్చని జీవో జారీ అయింది.
జంట ఇళ్లను నిర్మిచుకోవచ్చని జీవో నెంబర్ 94ను 20వ తేదీన జారీ చేశారు. ఇక గృహనిర్మాణ సంస్థ యంత్రాంగానికి కొన్నిచోట్ల పండగే పండగ అన్నట్టుగా తయారైంది. నిబంధనలు సడలించడంతో ఇళ్ల సంతర్పణకు ముందస్తుగా కొంతమంది గృహ నిర్మాణ సంస్థ అధికారులు వసూళ్లకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాల్లో కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులు త్వరలో జంట ఇళ్లకు అవకాశం దక్కనుందని ప్రచారం చేసినట్టు తెలిసింది. దీనివల్లే చాలామంది ఇళ్ల నిర్మాణానికి ఇప్పటివరకు ముందుకు రాక చాలాచోట్ల ఈ పథకం గ్రౌండ్ కాలేదు. నేతలు ఇచ్చిన ప్రతిపాదనలవల్లే ఈ జీవోలు వచ్చినట్టు తెలుస్తోంది. ఇపుడు ప్రజాప్రతినిధులు చెప్పినట్టుగానే జీవోలు జారీకావడంతో గృహ నిర్మాణం ముమ్మరం అవుతోంది. ఒకేసారి ముమ్మరంగా ఇళ్లు మంజూరుకావడంతో ఇప్పటి వరకు ఖాళీగావున్న గృహనిర్మాణ సంస్థ యంత్రాంగం ఒక్కసారిగా ఎక్కడెక్కడ నుంచో వెనక్కి వస్తున్నారు. ఆయా రాజకీయ నాయకులను పట్టుకుని పైరవీలతో అనుకున్న స్థానాలను దక్కించుకుంటున్నారు. అవసరం లేకపోయినా సామాజికవర్గాల పైరవీలతో ఇబ్బడిముబ్బడిగా పాత వర్కు ఇన్‌స్పెక్టర్లు సంబంధిత ఉన్నతాధికారికి తృణమో పణమో ముట్టజెప్పి తాము అనుకున్న ప్రాంతాలకు వస్తున్నట్టు తెలుస్తోంది.
‘ఎన్టీఆర్ గ్రామీణ్’లో 2016-17, 17-18, 18-19కు సంబంధించి మొత్తం 6 లక్షల ఇళ్లను నిర్మించనున్నారు. ఒకే కాంపౌండ్ వాల్‌లో మధ్య గోడ, జంట గృహాలకు అనుమతిచ్చారు. దీనికి సంబంధించి గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్లు తయారుచేసిన జాబితాలపై ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పర్యవేక్షించాల్సివుంది. రెండు ఇళ్లకు రెండు మార్గాలు వుండాలి. వాస్తు సంబంధ సమస్య వస్తే కనీసం ముఖ ద్వారాలు విడి విడిగా వుండాలని నిర్దేశించారు.
కానీ ప్రధాన ద్వారాలు ఒకవైపే ఉండాలని జీవోలో పేర్కొన్నారు. ఉమ్మడి గోడకు అదనపు ద్వారాలు ఉండకూడదని, నిర్మాణ స్థలం 750 చదరపు అడుగుల వరకు నిర్మించుకోవచ్చని మార్గదర్శకాలు ఇచ్చారు. ఒకవేళ ఉమ్మడి గోడ పెట్టుకుంటే ప్రధాన కాంపౌండ్ గోడ కంటే ఎక్కువ మందం ఉండకూడదు. ఇద్దరు లబ్ధిదారులు వేరువేరుగా ఉండాలని, డి ఫారం పట్టా గానీ, పొజిషన్ సర్ట్ఫికెట్‌గానీ వేర్వేరుగా ఉండాలని, ఇందుకు అఫిడవిట్ ఇవ్వాలని నిర్దేశించారు. ఏదేమైనప్పటికీ మళ్లీ పాత విధానం దారికే వచ్చినట్టు తెలుస్తోంది.