బిజినెస్

కొత్త ప్లాన్‌ను ప్రారంభించిన శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీనియస్ అస్యూర్డ్ బెనిఫిట్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. చిన్నారుల విద్యావసరాలు తీర్చేరీతిలో ఈ కొత్త ప్లాన్‌ను అమల్లోకి తెచ్చినట్లు ఆ సంస్థ ఎండి కాస్పారస్ క్రోమ్‌హౌట్ తెలిపారు. తల్లిదండ్రుల జీవితాన్ని కవర్ చేయడంతో పాటు చిన్నారుల భవిష్యత్ విద్యావసరాలు, ఇతర లక్ష్యాలను తీర్చేందుకు అవసరమైన పూర్తి స్థాయి ఫైనాన్సియల్ టూల్‌గా ఈ కొత్త ప్లాన్ ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ప్లాన్ ద్వారా 10 నుంచి 15 శాతం మార్కెట్‌ను తమ ఉత్పత్తుల విభాగంలో లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. ఈ కొత్త ప్లాన్‌లో ఆటో కవర్ ఆప్షన్ ఉందని అన్నారు. ఒక వేళ రెండు సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత పాలసీ గ్రహీత ప్రీమియం చెల్లించలేని స్థితిలో ఉంటే ఒక ఏడాది పాటు కవరేజీ కొనసాగిస్తారని తెలిపారు. ఈ ఉత్పత్తి గణనీయమైన వాల్యూమ్స్ సృష్టించనుందని అంచనా వేసినట్లు చెప్పారు. పాలసీ కాలపరిమితి 10 నుంచి 18 ఏళ్ల పాటు ఉంటుందని ఆయన వివరించారు.