బిజినెస్

వౌలిక సదుపాయాలు కల్పిస్తే... రూ.100 కోట్లతో టైల్స్ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, నవంబర్ 23: రాష్ట్ర ప్రభుత్వం వౌలిక సదుపాయాలు కల్పిస్తే వంద కోట్ల రూపాయల వ్యయంతో టైల్స్ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని గుజరాత్‌కు చెందిన స్వస్తిక్ సిలికాన్ లిమిటెడ్ సీఈవో యు రామ్మోహనరావు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో గురువారం టైల్స్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలోని ఐదు ప్రముఖ టైల్స్ ఫ్యాక్టరీల్లో తమది ఒకటన్నారు. దేశంలో ఒక్క గుజరాత్ రాష్ట్రంలోనే 700 టైల్స్ ఫ్యాక్టరీలు కేంద్రీకృతమై ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ముడి సరుకును గుజరాత్‌కు దిగుమతి చేసుకుని, టైల్స్ తయారుచేస్తున్నామని, వాటిని తిరిగి ఆంధ్రప్రదేశ్‌లోనే విక్రయిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే పరిశ్రమ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. టైల్స్ పరిశ్రమకు ప్రధానంగా గ్యాస్ సమస్య ఆటంకంగా ఉంటుందన్నారు. తమకు అవసరమైనంత మేర గ్యాస్ అందించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేస్తే కోస్తాంధ్రాలో 15 ఎకరాల్లో వంద కోట్ల వ్యయంతో పరిశ్రమ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఫ్యాక్టరీ ఎండీ గిరీష్‌బావ్ పటేల్ తెలంగాణ సీఎం కెసిఆర్‌తో కూడా సంప్రదింపులు జరిపారని, ఏ రాష్ట్రం సౌకర్యాల కల్పనకు ముందుకువస్తే ఆ రాష్ట్రంలో ఫ్యాక్టరీ ఏర్పాటుచేస్తామన్నారు. దేవరపల్లిలో ప్రారంభించిన కల్లూరి ఎంటర్ ప్రైజెస్‌తో కలిపి తమ సంస్థ ఏపీలో ఇప్పటివరకు అయిదు షోరూంలు నెలకొల్పిందన్నారు. కల్లూరి ఎంటర్ ప్రైజెస్ అధినేతలు కల్లూరి అప్పారావు, కల్లూరి హనుమంతురావు, కల్లూరి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.