బిజినెస్

గత ఆర్థిక సంవత్సరం 3.9 శాతంగా ద్రవ్యలోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 31: గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో నిర్దేశిత ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేధించామని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ‘2015-16లో ద్రవ్యలోటు జిడిపిలో 3.9 శాతంగా లేదా 5.32 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.’ అని గత ఆర్థిక సంవత్సరానికిగాను ఇక్కడ విడుదల చేసిన గణాంకాల సందర్భంగా కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సిజిఎ) తెలిపారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో ద్రవ్యలోటును జిడిపిలో 3.5 శాతానికే కట్టడి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా సిజిఎ పేర్కొన్నారు. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ లోటు జిడిపిలో 2.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు.