బిజినెస్

ఏపీ విపణిలోకి జాగ్వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 23: ప్రపంచవ్యాప్తంగా కార్ల ఉత్పత్తిలో విశేష గుర్తింపు పొందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ తన నెట్‌వర్క్‌ను ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించగా, గురువారం ఆంధ్రప్రదేశ్ వ్యాపార విపణిలోకి ప్రవేశించింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాల్లో వ్యాపారం సాగిస్తున్న జాగ్వార్ ఇప్పటివరకు 24 నగరాల్లో 26 ఔట్‌లెట్లు నపుడుతోంది. ఏపీ నూతన రాజధాని అమరావతిలో అతిపెద్ద ప్రీమియం కార్ షోరూమ్‌ను గురువారం ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్ల షోరూమ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. స్వయంగా కార్లను పరిశీలించి, డ్రైవ్ చేశారు. షోరూమ్‌ను, స్పేర్‌పార్ట్స్ విభాగాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఇలాంటి కార్ల షోరూమ్‌లు మరిన్ని రావాల్సి ఉందన్నారు. వ్యాపార పరంగా అన్ని అవకాశాలూ రాష్ట్రంలో ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు పేరున్న కంపెనీలు, ఔత్సాహికులు పెద్దఎత్తున ఇక్కడకు వస్తున్నట్లు చెప్పారు. అమరావతి సమీపంలోని మంగళగిరిలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా తరపున అధీకృత డీలర్‌గా లక్ష్మి కార్స్ ఈ షోరూమ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా జాగ్వార్, ల్యాండ్ రోవర్ మోడల్స్‌కు సంబంధించిన కార్ల ప్రదర్శనతో పాటు అమ్మకం, సర్వీసింగ్, స్పేర్ పార్ట్స్ ఇక్కడ లభించనున్నాయి. అత్యాధునిక మల్టీ లెవల్ సదుపాయం ద్వారా ఈ షోరూమ్‌లో కార్లను ప్రదర్శించడంతో పాటు 20 సర్వీస్ బేలు కూడా ఏర్పాటు చేశారు. వీటితోపాటు అత్యాధునిక యంత్ర సామగ్రితో కూడిన సర్వీస్ సెంటర్‌లో అత్యున్నత నైపుణ్యం కలిగిన టెక్నీషియన్లు, ఇతర సర్వీస్ పర్సన్స్ సేవలు అందించనున్నారు. అల్ట్రా మోడ్రన్, ఇంటిగ్రేటెడ్, ఒన్‌స్టాప్ సదుపాయం ద్వారా తమ వినియోగదారులకు ఒకేచోట సేల్స్, సర్వీస్, స్పేర్‌పార్ట్స్‌ను అందిస్తున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహిత్ సూరి తెలిపారు. వినియోగదారులు తమకు కావలసిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లను ఆన్‌లైన్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా కూడా ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకునే ఏర్పాట్లు చేసినట్లు లక్ష్మి కార్స్ మేనేజింగ్ డైరెక్టర్ జైరామ్ కంభంపాటి తెలిపారు. ల్యాండ్ రోవర్ శ్రేణిలోని డిస్కవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఏవోక్యూ, సరికొత్త డిస్కవరీ, రేంజ్ రోవర్ స్పోర్ట్, రేంజ్ రోవర్ వంటి అన్ని మోడల్స్‌ను ఈ షోరూమ్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన వివరించారు.

చిత్రం..జాగ్వార్ ల్యాండ్ రోవర్ షోరూమ్‌ను ప్రారంభిస్తున్న చంద్రబాబు