బిజినెస్

అంబీ వ్యాలీ ఆస్తులను వేలం వేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 23: సహారా గ్రూపునకు చెందిన అంబీ వ్యాలీ ఆస్తులను వేలం వేసే విషయంలో బాంబే హైకోర్టు నియమించిన అధికారిక లిక్విడేటర్‌కు సహాయాన్ని అందించాలని సుప్రీం కోర్టు గురువారం బాంబే హైకోర్టు అధికారిక రిసీవర్‌ను ఆదేశించింది. అదేవిధంగా అంబీ వ్యాలీ ఆస్తుల వేలం విషయంలో బాంబే హైకోర్టు నియమించిన రిసీవర్ సహాయాన్ని పొందాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏకే.సిక్రీలతో కూడిన ధర్మాసనం బాంబే హైకోర్టు అధికారిక లిక్విడేటర్‌కు స్పష్టం చేసింది. ‘అంబీ వ్యాలీ ఆస్తులను వేలం వేయాలని మేము కోరుతున్నాం. ఈ వేలం ప్రక్రియ ముగిసే వరకు బాంబే హైకోర్టు రిసీవర్‌ను మీకు సహాయకారిగా నియమిస్తాం’ అని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఈ వేలం ప్రక్రియను సజావుగా ముగించేందుకు బాంబే హైకోర్టు లేదా సహారా కంపెనీ జడ్జి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు లిక్విడేటర్‌ను ఆదేశించింది. తాము తిరిగి చెల్లించాల్సిన మొత్తం 24 వేల కోట్ల రూపాయల్లో మిగిలిన దాదాపు రూ.9 వేల కోట్లను చెల్లించేందుకు 18 నెలల గడువు ఇవ్వాలని సహారా గ్రూపు గతంలో సుప్రీం కోర్టును కోరింది. అయితే అంబీ వ్యాలీ ఆస్తులను అమ్మేందుకు గత నెల 12వ తేదీన నిర్వహించిన వేలాన్ని సహారా గ్రూపు అడ్డుకుందన్న ఆరోపణలు రావడంతో ఆ సంస్థపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విషయం విదితమే. అంబీ వ్యాలీ ఆస్తుల వేలానికి ఎవరైనా అవరోధాన్ని కలిగించేందుకు ప్రయత్నిస్తే కోర్టు ధిక్కరణ నేరంగా పరిగణించి జైలుకు పంపుతామని హెచ్చరించింది.