బిజినెస్

విత్తన భాండాగారంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 24: మేలైన పంటల విత్తనాలను ధృవీకరించి వాటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఐరోపా యూనియన్ తరహాలో పలు ఆసియా దేశాలతో విత్తన ఎగుమతి యూనియన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. ఏకీకృత నియమాలతో ఒకే తరహా విత్తన ప్రయోగశాలను ఏర్పాటు చేసి అంతర్జాతీయ విత్తన పరీక్ష సమాఖ్య ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాలని కూడా సూచించినట్లు తెలిపారు. ఈ మేరకు రెండవ జాతీయ టాస్క్ఫోర్స్ మీటింగ్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం నాడిక్కడ ఒక హోటల్‌లో అంతర్జాతీయ విత్తన ధృవీకరణ (ఒఈసిడి) సమావేశంలో పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోనే విత్తనోత్పత్తికి అద్భుతమైన వాతావరణం తెలంగాణలో ఉందని అన్నారు. దేశానికి కాకుండా ప్రపంచం మొత్తానికి విత్తనాలు సరఫరా చేసే శక్తి సామర్ధ్యం, వాతావరణం ఇక్కడ ఉన్నందున తెలంగాణను ప్రపంచ విత్తన భాండాగారంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలను పండించడమే లక్ష్యంగా రైతులు ముందుకు వస్తే వారికి ఆర్థికంగా వృద్ధి చెందేందుకు ఎంతో మేలు జరుగుతుందనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు.