బిజినెస్

ఇండియన్ మోటార్‌సైకిల్ నుంచి స్కౌట్ బాబర్ సూపర్ బైక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 24: పొలారిస్ ఇండస్ట్రీస్ ఆధీనంలో పనిచేస్తున్న అమెరికన్ సూపర్ బైకుల తయారీ సంస్థ ఇండియన్ మోటార్‌సైకిల్ తమ స్కౌట్ బాబర్ మోడల్‌ను శుక్రవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను 12.99 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ (ఆరు గేర్లు)తో కూడిన 1,133 సీసీ ఇంజన్‌తో ఈ బైకును తీర్చిదిద్దామని ఇండియన్ మోటార్‌సైకిల్ ఒక ప్రకనటలో వెల్లడించింది. భారత వినియోగదారులు దీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్న మోటార్‌సైకిళ్లలో స్కౌట్ బాబర్ మోడల్ ఒకటని, ఇది ఎక్కువ మంది ఖాతాదారులను ఆకర్షిస్తుందని ఆశిస్తున్నామని పొలారిస్ ఇండియా కంట్రీ హెడ్, మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ దూబే తెలిపారు. తమ ఉత్పత్తులన్నింటినీ అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ సంస్థ ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో ఎనిమిది మోడళ్ల బైకులను అమ్ముతోంది. ఇప్పుడు స్కౌట్ బాబర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టడంతో వీటి సంఖ్య తొమ్మిదికి పెరిగింది.