బిజినెస్

వరుసగా ఎనిమిదో రోజు.. స్వల్ప లాభాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 27: వరుసగా ఎనిమిదో సెషన్‌లో కూడా సెనె్సక్స్ ఎలాంటి పాయింట్లు నష్టపోకుండా స్వల్పంగా రాణించింది. ఎస్‌అండ్‌పీ రేటింగ్ యథాతథంగా కొనసాగడంతో మార్కెట్‌లో సరికొత్త ఉత్సాహం లేకపోయినా రాబోయే పరిణామాలపై ఇనె్వస్టెర్లు దృష్టి సారించి ఆచితూచి వ్యవహరించారు. చివరి క్షణంలో జరిగిన ఆకస్మిక కొనుగోళ్ల ఫలితంగా సెనె్సక్స్ 45.20 పాయింట్లు పెరిగి 33,724.44 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా కేవలం కేవలం 9.85 పాయింట్లు పెరిగి 10,399.55 వద్ద ముగిసింది. దేశీయ సంస్థాగత ఇనె్వస్టర్లు జరిపిన కొనుగోళ్లు, ఐరోపా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మార్కెట్ ఉత్సాహానికి కొంత ఊతాన్నిచ్చాయి. వివిధ దశల్లో మార్కెట్ ఊగిసలాడినప్పటికీ ఇంధనం, రియాల్టీ, వినియోగ వస్తువులు, మూలధన వస్తువుల షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. వరుసగా ఎనిమిదో రోజు కూడా ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీ స్వల్పంగానైనా పుంజుకోవడానికి కారణం ఈ సంస్థల షేర్ల విలువ పెరగడమే. 2015 జూన్ 3వ తేదీ తర్వాత మార్కెట్లు వరుస విజయాలను నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. నేటి లావాదేవీల్లో ఎన్‌టీపీసీ షేరు 3.13 శాతం పెరిగింది. యాక్సిస్ బ్యాంకు షేరు 2.73 శాతం పెరిగాయి. అలాగే ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, విప్రో, ఎల్‌అండ్‌టీ షేర్లు కూడా దాదాపు 1.24 శాతం మేర రాణించాయి.