బిజినెస్

సామాన్యుడికి ‘ధరా’ఘాతం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 27: నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా వైఫల్యం చెందింది. అధిక ధరలకు సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. కూరగాయల నుండి పప్పుదినుసులు, గుడ్లు, వంటనూనె ధరలు అమాంతం పెరిగిపోవడంతో అన్ని వర్గాల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోర పరాజయం పాలయ్యింది. బ్లాక్ మార్కెటీర్లపై నిఘా లోపం, హోల్‌సేలర్లు సహకరించకపోవడం తదితర కారణాలతో మార్కెట్‌లో ధరలు ఆకాశాన్నంటాయి. ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కార్తీకమాసం పుణ్యమా అని కూరగాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే కార్తీకం పూర్తయినప్పటికీ పెరిగిన ధరలు నేలకు దిగి రాకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సాధారణ మార్కెట్ల నుండి రైతు బజార్ల వరకు కూరగాయల ధరల పరిస్థితి ఇలాగేవుంది. ఇతర రాష్ట్రాల నుండి ఉల్లి, టమాటోలను దిగుమతి చేసుకుని ధరలను అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పులేకపోవడం గమనార్హం. రైతుబజారులో కిలో టమాటా ధర ప్రస్తుతం రూ.40 పలుకుతోంది. సాధారణ మార్కెట్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉల్లి కిలో ధర రైతుబజారులో రూ.44 ఉండగా బయటి మార్కెట్‌లో వ్యాపారులు తమ చిత్తం వచ్చిన చందాన విక్రయాలు సాగిస్తున్నారు. కిలో కేరట్ రూ.84, బీట్‌రూట్ రూ.72కు అమ్ముతున్నారు. కాకరకాయ కిలో రూ.44కు చేరింది. అల్లం, పచ్చిమిర్చి నుండి ఆకు కూరల వరకు ధరలు చుక్కల్లో కనిపిస్తున్నాయి. ఇక కోడిగుడ్ల విషయానికి వస్తే ఊహించని రీతిలో ధర పెరిగింది. నిన్న మొన్నటి వరకు గుడ్డు ఒక్కింటికి రూ.4 పలకగా, ప్రస్తుతం రూ.7 వరకు పలుకుతోంది. వంట నూనెల ధరలపై కూడా నియంత్రణ లేకపోవడంతో ఎవరికి తోచినట్టుగా వారు విక్రయాలు సాగిస్తున్నారు. పప్పు దినుసుల ధరలు సైతం విపరీతంగా పెరిగాయి. పెసరపప్పు హోల్‌సేల్‌లో కిలో రూ.61 కాగా, రిటైల్‌లో వ్యాపారులు తమకు నచ్చినట్టు ధర పెంచి విక్రయిస్తున్నారు. విశేషం ఏమిటంటే హోల్‌సేల్ ధరకు దీటుగా తూర్పు గోదావరి జిల్లాలోని రైతు బజార్లలో పెసరపప్పు రూ.70కు విక్రయిస్తున్నట్టు అధికారులు గమనించారు. ఇతర పప్పు దినుసుల ధరలు కూడా అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.