బిజినెస్

ఎగవేతదారుల రుణాలు మాఫీ చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: బ్యాంకు రుణాలను భారీగా ఎగవేసినవారి బాకీలను మాఫీ చేయలేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు. రుణాలను ఎగవేసిన పెట్టుబడిదారుల బాకీలను బ్యాంకులు మాఫీ చేశాయంటూ వస్తున్న వదంతులను జైట్లీ తిరస్కరించారు. కాపిటలిస్టుల రుణాలను బ్యాంకులు మాఫీ చేశాయంటూ గత కొన్ని రోజులుగా ఒక వదంతి ప్రచారంలో ఉందని పేర్కొన్న ఆయన ‘దేశ ప్రజలకు ఈ విషయంలో వాస్తవాలను తెలియజేయాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని అన్నారు. 2008-2014 సంవత్సరాల మధ్యకాలంలో ఎవరి ప్రోద్బలంతో కాపిటలిస్టులకు ఇంత భారీగా రుణాలిచ్చారన్న వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ రకమైన వదంతులను ప్రచారం చేస్తున్న వ్యక్తులే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని, ఇలాంటి వ్యక్తుల ఒత్తిడుల వల్లే ప్రభుత్వ రంగ బ్యాంకులు పెట్టుబడిదారులకు రుణాలిచ్చాయన్న విషయాన్ని మరిచిపోవడానికి వీల్లేదన్నారు. ఈ రుణ గ్రహీతలు రుణాలు చెల్లించడాన్ని ఎప్పుడు ఆపివేశారు? వడ్డీ కూడా కట్టడం ఎప్పుడు మానివేశారు? ఆ విషయంలో అప్పటి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అన్న ప్రశ్నలకు కూడా ఈ వదంతుల ప్రచారకర్తలు జవాబు ఇవ్వాలన్నారు. రుణాలను ఎగవేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అలాంటి వారికి అప్పటి ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించిందని ఎగవేతదారులందర్నీ నాన్ ఎన్‌పిఏ ఖాతాదారులుగా మార్చిందని ఆయన గుర్తుచేశారు.