బిజినెస్

2019 జూన్ నాటికి క్యాంపస్ సిద్ధం : హెచ్‌సీఎల్ చీఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 28: ఐటీ దిగ్గజం, హెచ్‌సీఎల్ అధినేత శివనాడార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఈసందర్భంగా వారిద్దరి మధ్య హెచ్‌సీఎల్ క్యాంపస్ ఏర్పాటుపై చర్చ జరిగింది. విజయవాడ విమానాశ్రయం వద్ద నిర్మించే నూతన భవన డిజైన్లపై శివనాడార్ సీఎంకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. కలంకారీ నేత, కొండపల్లి బొమ్మలు ప్రతిబింబించేలా అమరావతి బౌద్ధశిల్ప నిర్మాణ శైలిలో కొత్త భవనాలుంటాయని ఆయన సీఎంకు వివరించారు. రెండు దశల్లో నిర్మాణాలుంటాయని, మొత్తం 750 కోట్ల పెట్టుబడులు, 7500 మందికి ఉద్యోగావకాశాలుంటాయని చెప్పారు. 2019 నాటికి క్యాంపస్ సిద్ధమవుతుందని ఆయన సీఎంకు హామీ ఇచ్చారు. అనంతరం శివనాడార్‌తో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. తొలుత నాడార్‌ను లోకేష్ ఘనంగా స్వాగతించి సచివాలయంలో ఇటీవలే ప్రారంభించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తీసుకువెళ్లి, దాని పనితీరును వివరించారు. ఐటిలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు తాము తీసుకున్న చర్యలను ఆయనకు వివరించారు.

చిత్రం..శివనాడార్‌ను సత్కరిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు