బిజినెస్

ఆక్వా హబ్‌లో ఆగ్రహ జ్వాలలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 24: జిల్లాను ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దుతానని పదేపదే ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటనలు కార్యరూపం దాల్చడంలేదని పశ్చిమ గోదావరి జిల్లాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆక్వాకల్చర్‌లో పశ్చిమ గోదావరి జిల్లా అగ్రస్థానంలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. వస్తుంది వస్తుందని ఊరించిన వనామీ తల్లి రొయ్య ఉత్పత్తి కేంద్రం సిక్కోలు తరలిపోవడంతో ఆక్వా రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నారు. వివరాల్లోకి వెళితే... గత సార్వత్రిక, స్థానిక ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది. మొత్తం అన్ని లోక్‌సభ, శాసనసభ స్థానాలు ఆ పార్టీ, మిత్రపక్షం బిజెపి ఖాతాలో చేరాయి. ఈసందర్భంగానే జిల్లాను ఆక్వాహబ్‌గా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే నీలి విప్లవ రాజధానిగా ఉన్న జిల్లాలో అంతర్జాతీయ రొయ్యల కేంద్రం ఏర్పాటుచేస్తారని ఇక్కడి ఆక్వా రైతులు భావించారు. వనామీ తల్లి రొయ్యను ఉత్పత్తిచేసే ఈ కేంద్రం జిల్లాకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రస్తుతం జిల్లాలో వనామి రొయ్యసాగు ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటైతే నాణ్యమైన సీడ్ దొరుకుతుందని రైతులు ఆశలు పెంచుకున్నారు. కాని వారి ఆశలు అడియాశలయ్యాయి.
వనామీ తల్లి రొయ్యను ఉత్పత్తి చేసే ఈ అంతర్జాతీయ రొయ్యల కేంద్రం శ్రీకాకుళం జిల్లాకు తరలిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థాయ్‌లాండ్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా నెలకొల్పదల్చిన ఈ కేంద్రాన్ని శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటుచేయనున్నారు. ఆక్కడి సముద్రతీరాన్ని పారిశ్రామిక కారిడార్‌గా మార్చేందుకు చేపట్టిన ప్రణాళికల్లో భాగంగా ఈ కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిక్కోలులో ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఆక్వా కల్చర్ వృద్ధిరేటులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో ఈ అంతర్జాతీయ రొయ్యల కేంద్రం ఏర్పాటు చేస్తారని అంతా భావించారు. దేశంలోనే అత్యధికంగా వనామీ సాగు జరుగుతున్న జిల్లా పశ్చిమగోదావరి జిల్లా. సుమారు లక్షన్నర ఎకరాల్లో వనామీ సాగు జరుగుతుంది. ఇక్కడి నుండే ఇండోనేషియా, చైనా, జపాన్, థాయ్‌లాండ్ తదితర దేశాలకు రొయ్యల ఎగుమతులు జరుగుతుంటాయి. అన్ని వసతులకు కూడా అనువైన ప్రాంతంగా పశ్చిమగోదావరి జిల్లాలోని తీరప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో ముందుగా అంతర్జాతీయ రొయ్యల కేంద్రం, గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు, ఆక్వా యూనివర్శిటీ వస్తాయని అంతా భావించారు. కాని ఇంతలోనే అంతర్జాతీయ రొయ్యల కేంద్రం శ్రీకాకుళంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించడంపై రైతుల్లో తీవ్రన నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాను ఆక్వాహబ్‌గా తీర్చిదిద్దుతానన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడ్జెట్‌లో అతి తక్కువ నిధులను కేటాయించారని రైతుల్లో నిరసన వ్యక్తమవుతోంది. ఈలోగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పుండుమీద కారం చల్లినట్టయ్యింది.
ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు వనామీ సాగులో వైరస్ సోకుతుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటివరకు థాయ్‌లాండ్ నుండి వచ్చిన తల్లి రొయ్యను చెన్నైలోని యానిమల్ క్వారంటైన్‌కు వెళ్ళి అక్కడి నుండి రైతులు తెచ్చుకుంటున్నారు. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో తల్లి రొయ్య వనామీ ఉత్పత్తి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటుచేయాలని ఎంతోకాలంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే హఠాత్తుగా శ్రీకాకుళం జిల్లాలో ఈ కేంద్రం నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆక్వా రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు.