బిజినెస్

ఆయిల్‌పాం రైతులకు ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 29: ఆయిల్‌పాం రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎపిసి, వ్యవసాయ కార్యదర్శి సి. పార్థసారథి కోరారు. వ్యవసాయ ధరల నిర్ణాయక కమిషన్ (సిఎసిపి) చైర్మన్ విజయ్‌పాల్ శర్మ నేతృత్వంలో బుధవారం ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ, ఆయిల్‌పాం గెలల ధర ఒక్కో టన్నుకు 12 వేల రూపాయలుగా నిర్ణయించాలని రైతులు చేస్తున్న డిమాండ్‌ను పరిశీలించాలన్నారు. ఆయిల్‌పాం ధర టన్నుకు 10 వేల రూపాయలు తక్కువ కాకుండా ఉండేలా చూడాలని పార్థసారథి సూచించారు. ప్రస్తుతం ఉన్న విధానంలో రైతులకు ధర గిట్టుబాటు కాదన్నారు. ఆయిల్‌పాం రైతులు బోర్‌వెల్స్ వేసేందుకు, ఆధునిక యంత్రాలు కొనుగోలు చేసేందుకు సబ్సిడీని 50 శాతం వరకు ఇవ్వాలన్నారు. వర్మికంపోస్ట్ ఎరువులను 50 శాతం ధరలకే రైతులకు అందించాలన్నారు. ప్రస్తుతం అశ్వారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీ గంటకు 15 టన్నుల ఆయిల్‌పాం ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగి ఉందని, దీని సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. అలాగే కొత్తగా గంటకు 30 టన్నుల ఆయిల్‌పాం ప్రాసెస్ చేసే యూనిట్‌ను నెలకొల్పాలని, అవసరమైతే కొత్త యూనిట్ సామర్థ్యం 60 టన్నులకు పెంచగలిగే శక్తి కలిగి ఉండాలన్నారు. ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ పర్సెంటేజ్ 20 శాతం మించి తీయగలిగే ఆధునిక ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. దాని వల్ల రైతులకు మరింత ఎక్కువ ధర లభించగలదన్నారు. ఆయిల్‌పాం రైతులకు లబ్ది చేకూరేందుకు డ్రిప్ ఇరిగేషన్ యంత్రాలను ఇచ్చేందుకు ప్రస్తుతం ఉన్న నియమావళిలో సడలింపు చేసిందన్నారు. ఆయిల్‌పాం ధర టన్నుకు 12 వేల రూపాయలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఈ సందర్భంగా సిఎసిపి చైర్మన్‌ను కోరారు. ఈ సమావేశంలో సిఎసిపి మెంబర్ సెక్రరీ డాక్టర్ శైలజా శర్మ, ఆయిల్‌ఫెడ్ వైస్-చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. వీరభద్రయ్య, ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకటరామిరెడ్డి, రైతులు ఆలపాటి రామచంద్రప్రసాద్, ఎస్. వెంకటేశ్వరరావు, తాళ్లూరి చందర్‌రావు. జి. సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..బుధవారం హైదరాబాద్‌లో వ్యవసాయ శాఖ నిర్వహించిన ఉన్నత స్థాయ సమావేశంలో
మాట్లాడుతున్న ఆ శాఖ కార్యదర్శి పార్థసారథి. పాల్గొన్న అధికారులు