బిజినెస్

నాలుగో రోజూ పతనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 1: భారీగా పెరుగుతున్న ద్రవ్య లోటుపై మదుపరులలో నెలకొన్న భయాందోళనలను తొలగించడంలో రెండో త్రైమాసికంలో పుంజుకున్న స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు విఫలమయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు శుక్రవారం ప్రధాన సూచీలు పడిపోయాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 316 పాయింట్లు పతనమయి, 33వేల మైలురాయికి దిగువన ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 104.75 పాయింట్లు పడిపోయి, 10,121.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. రెండు కీలక సూచీలు కూడా ఈ వారం భారీగా పతనమయ్యాయి. సెనె్సక్స్ 846.30 పాయిం ట్లు (2.51 శాతం) పడిపోగా, నిఫ్టీ 267.90 పాయింట్లు (2.57 శాతం) దిగజారింది.
దేశ స్థూలార్థిక గణాంకాలలో మెరుగుదల కనిపించినప్పటికీ, మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించి, సెషన్ చివరి అర్ధ భాగంలో షేర్ల విక్రయానికి పూనుకున్నారు. 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ శుక్రవారం ఉదయం గరిష్ఠ స్థాయి 33,300.81 పాయింట్ల వద్ద ప్రారంభం అయినప్పటికీ, తరువాత ప్రతికూల జోన్‌లోకి పడిపోయి 32,797.78 పాయింట్లకు పతనమయింది. తరువాత స్వల్పంగా కోలుకొని 32,832.94 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్‌తో పోలిస్తే 316.41 పాయింట్లు (0.95 శాతం) పడిపోయింది. నవంబర్ 15 నుంచి సెనె్సక్స్ ఇంత దిగువ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. 50 షేర్లతో కూడిన నిఫ్టీ శుక్రవారం 10,200 పాయింట్ల మైలు రాయి దిగువకు పతనమయింది. ఇంట్రా-డేలో 10,108.55 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన నిఫ్టీ చివరకు కొంత కోలుకొని 10,121.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 104.75 పాయింట్లు (1.02 శాతం) నష్టపోయింది.
ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌ఐఐలు) గురువారం నికరంగా రూ. 1,500.76 కోట్ల విలువ గల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 1,202.57 కోట్ల విలువ గల షేర్లను కొనుగోలు చేశారు. శుక్రవారం నాటి సెషన్‌లో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు వరుసగా 1.16 శాతం, 0.95 శాతం చొప్పున పడిపోయాయి. శుక్రవారం లాభపడిన షేర్లలో మారుతి సుజుకి, టీవీఎస్ మోటర్, అశోక్ లేల్యాండ్ మొదలగునవి ఉన్నాయి.
అదాని పోర్ట్స్ అధికంగా మూడు శాతం నష్టపోయింది. 2.99 శాతం నష్టంతో బజాజ్ ఆటో తరువాత స్థానాన్ని ఆక్రమించింది. నష్టపోయిన ఇతర కంపెనీలలో భారతి ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, ఎస్‌బీఐ, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్, కోల్ ఇండి యా, రిల్ మొదలగునవి ఉన్నాయి.

*దేశ స్థూలార్థిక గణాంకాలలో మెరుగుదల కనిపించినప్పటికీ, మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించి, సెషన్ చివరి అర్ధ భాగంలో షేర్ల విక్రయానికి పూనుకున్నారు. దీంతో 30 షేర్లతో కూడిన సెనె్సక్స్ శుక్రవారం ఉదయం గరిష్ఠ స్థాయి 33,300.81 పాయింట్ల వద్ద ప్రారంభం అయినప్పటికీ, తరువాత ప్రతికూల
జోన్‌లోకి పడిపోయి 32,797.78 పాయింట్లకు పతనమయింది.