బిజినెస్

పతనమైన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 2: దేశీయ మార్కెట్లు ఈ వారంలో పతనమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 846.30 పాయింట్లు పడిపోయి, 32,832.94 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 10, 200 పాయింట్ల మైలురాయికన్నా దిగువకు దిగజారి, 10,121.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ వారమంతా మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే సాగాయి. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు ఎలా ఉంటాయోనన్న అనిశ్చితి తొలి మూడు రోజులు మార్కెట్లను వెంటాడింది. క్రితం అయిదు త్రైమాసికాలు దిగజారిన జీడీపీ చివరకు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో పుంజుకోవడంతో మార్కెట్లలో షార్ట్ కవరింగ్ లాభాలు చోటు చేసుకున్నాయి. అయితే ద్రవ్య లోటు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్షకు పూనుకోవడంతో అమెరికాతో తిరిగి ఉద్రిక్తతలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను మళ్లీ దెబ్బతీసింది. సెనె్సక్స్ ఈ వారం మొదట్లో 33,640.51 పాయింట్ల కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమయి, 33,770.15- 33,797.78 పాయింట్ల మధ్య కదలాడి చివరకు 32,832.94 పాయింట్ల వద్ద ముగిసింది. సెనె్సక్స్ గత వారం 364.68 పాయింట్లు (1.09 శాతం) లాభపడింది. ఈ వారం నిఫ్టీ కూడా 10,361.05 పాయింట్ల కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమయి, 10,409.55- 10,108.55 పాయింట్ల మధ్య కదలాడి, చివరకు 10,121.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఈ వారం మెటల్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, ఐటీ, టెక్నాలజీ, బ్యాంకులు, చమురు, వాయువు, విద్యుత్తు, ఆటో, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్‌ఎంసీజీ, కన్యూజమర్ డ్యూరేబుల్స్, క్యాపిటల్ గూడ్స్ కంపెనీల షేర్లను మదుపరులు ఎక్కువగా విక్రయించారు. రియాల్టీ, ఐపీఓలకు చెందిన షేర్లను ఎక్కువగా కొనుగోలు చేశారు.