బిజినెస్

ఇన్ఫోసిస్‌కు ఇక పరేఖ్ నేతృత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 2: భారత్‌లో రెండో అతి పెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ) సంస్థ అయిన ఇన్ఫోసిస్ ప్రధాన కార్యనిర్వహణ అధికారి (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్‌గా సలీల్ ఎస్ పరేఖ్ నియమితులయ్యారు. పరేఖ్ వచ్చే సంవత్సరం జనవరి 2వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారని ఇన్ఫోసిస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘పరేఖ్‌కు ఐటీ సేవల పరిశ్రమలో సుమారు మూడు దశాబ్దాల గ్లోబల్ ఎక్స్‌పీరియెన్స్ ఉంది. వ్యాపారాలను లాభాల బాట పట్టించడంలో, కొత్త సంస్థలను స్వాధీనం చేసుకోవడంలో ఆయనకు మంచి రికార్డు ఉంది’ అని ఇన్ఫోసిస్ బోర్డు చైర్మన్ నందన్ నిలేకని తెలిపారు. ఈ పరివర్తనా కాలంలో ఇన్ఫోసిస్‌ను ముందుకు తీసికెళ్లడానికి పరేఖ్ తగిన వ్యక్తి అని బోర్డు భావిస్తోందని నిలేకని పేర్కొన్నారు. పరేఖ్ ఇంతకు ముందు కాప్‌గెమినిలో పనిచేశారు. ఆ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా కూడా ఆయన వ్యవహరించారు.