బిజినెస్

మొబైల్ యాప్స్‌తో ప్రజల చెంతకు పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రభుత్వ పరిపాలనలో మొబైల్ యాప్‌ల పాత్ర క్రమేణా కీలకం కాబోతోంది. రోజు రోజుకీ కొత్త కొత్త యాప్‌ల ఆవిష్కరణ జరుగుతోంది. దీంతో ప్రజల చెంతకు పాలన, సేవలు మరింత వేగంగా అందుతున్నాయి. సేవల విభాగంలో తలెత్తే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తుండడమే కాకుండా డిజిటల్ లావాదేవీలు వేగవంతంగా జరిగేందుకు అవకాశం కలిగింది. ముఖ్యంగా లావాదేవీలు, చెల్లింపుల్లో పారదర్శకత ఉండడం వల్ల అనేక శాఖలు అవినీతిని అరికట్టే దిశగా యాప్‌ల ద్వారా సేవలను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు ఉండడం వల్ల యాప్‌ల వినియోగం సులభమైంది. ప్రభుత్వ శాఖలు ప్రారంభించిన యాప్‌ల పట్ల ప్రజల నుంచి కూడా విశేష స్పందన వస్తోంది. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే ఎం-వాలెట్ పేరుతో రాష్ట్ర రవాణా శాఖ (ఆర్టీఏ), మై-జిహెచ్‌ఎంసి పేరుతో జిహెచ్‌ఎంసి, హవాక్ ఐ పేరుతో సిటీపోలీస్ ప్రారంభించిన యాప్‌ల పట్ల ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. ఎం-వాలెట్ అనేది గత ఏడాది మార్చి 30న వాహన రిజిష్ట్రేషన్ డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో భద్రపర్చేందుకు ప్రారంభించింది. ఈ యాప్‌ను స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడం ద్వారా వాహనం తాలుకు డాక్యుమెంట్లను వెంట తీసుకెళ్లే అవసరం ఉండదు. పోలీసులు, ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో ఈ యాప్ ద్వారా డాక్యుమెంట్‌ను అప్పటికప్పుడు చూపించేందుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతించింది. ఎం-వాలెట్‌ను ప్రస్తుతానికి 20 లక్షల మంది వినియోగిస్తుండగా, ప్రతిరోజు కనీసం 3 వేల మంది కొత్తగా రిజిష్టర్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా వాహన ఈ-చలాన్లను ఎం-వాలెట్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడే చలాన్ల విధింపు మొత్తం సమాచారం రావడంతో వాహనాదారులు చెల్లించేందుకు చాలా సులభంగా మారింది. ఇలా అనుసంధానం చేయడం వల్ల దాదాపు రూ.కోటి మొత్తం చలాన్ల రూపంలో చెల్లించారని ఆయా వర్గాల సమాచారం. హైదరాబాద్ సిటీ పోలీసు ప్రారంభించిన హవాక్ ఐ యాప్‌కు కూడా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ వరకే పరిమితమన ఈ యాప్‌ను తెలంగాణలోని 9 పోలీసు కమిషనరేట్లకు విస్తరిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సమాచారం మేరకు హవాక్ ఐ యాప్‌ను 9 లక్షల మంది వినియోగిస్తున్నారు. ప్రతి రోజు ఒక్క హైదరాబాద్ కమిషనరేట్‌కు ఈ యాప్ ద్వారా 70 ఫిర్యాదులు అందుతున్నాయి. అలాగే ఈ ఏడాది జూలై 15న జిహెచ్‌ఎంసి మైజిహెచ్‌ఎంసి పేరుతో యాప్‌ను ప్రారంభించింది. జిహెచ్‌ఎంసి పరిధిలో ఈ యాప్‌ను 3 లక్షల మంది వినియోగిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ యాప్‌ను విడుదల చేసింది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, జనన, మరణ ధృవీకరణ పత్రాల డౌన్‌లోడ్, పౌర సంబంధిత సమస్యలను వివరించేందుకు వీలుగా ఈ యాప్‌ను జిహెచ్‌ఎంసి రూపొందించింది. ఈ యాప్ ద్వారా ఇప్పటి వరకు 90 వేల ఫిర్యాదులు అందాయి. ఈ ఏడాది జూన్ 1న తెలంగాణ ప్రభుత్వం టి-వాలెట్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ, ప్రైవేటు డిజిటల్ చెల్లింపులు చేసుకునేందుకు ప్రజలకు అనువుగా ఈ యాప్‌ను రూపొందించారు. ప్రస్తుతం ప్రారంభమైన మెట్రో స్మార్ట్ కార్డ్ వినియోగదారులు కూడా ఈ వ్యాలెట్ ద్వారా నగదును లోడ్ చేసుకుని తద్వారా మెట్రో టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఆరు నెలల్లో ఈ యాప్‌ను 3 లక్షల మంది వినియోగదారులు నమోదు చేసుకోగా రూ.75 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు అధికార వర్గాల సమాచారం. త్వరలో మరికొన్ని ప్రభుత్వ శాఖల్లో కూడా ఈ తరహా యాప్‌లను ప్రారంభించి సేవలను మరింత సులభంగా ప్రజలకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.