బిజినెస్

ముడిసరుకు ప్రభావం.. ఉక్కు బ్లాస్ట్ ఫర్నేస్ షట్‌డౌన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉక్కునగరం, డిసెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భారీ ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్ విభాగంలో ఉత్పత్తిపై ముడి సరుకు ప్రభావం పడింది. ఇటీవల కాలంలో మొదలైన ముడి సరుకు ప్రభావం మరింత తీవ్రతరం అవుతుంది. ముడిసరుకు కొరత ప్రభావం కారణంగా బ్లాస్ట్ ఫర్నేస్-1ను సోమవారం షట్‌డౌన్ చేశారు. ఆదివారం బ్లాస్ట్ ఫర్నేస్-2 కూడా అధికారులు షట్‌డౌన్ చేశారు. అయితే బ్లాస్ట్ ఫర్నేస్-2ను సోమవారం నుండి ఉత్పత్తిని ప్రారంభించింది. ముడిసరుకు కొరత ప్రభావం ఈనెల 15వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని కార్మిక వర్గాల తెలిపాయి. విశాఖ ఉక్కు యాజమాన్యం అవసరమైన ముడిసరుకు సమీకరించేందుకు యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలను ప్రారంభించింది. నీలాచల్ నుండి ఒక్క రేక్ ముడిసరుకును ఉక్కు యాజమాన్యం దిగుమతి చేసుకుంది. మంగళవారం కూడా మరోరేక్ ముడి సరుకు విశాఖ ఉక్కుకు చేరుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. తెల్లేట్స్‌ను రప్పించేందుకు యాజమాన్యం దృష్టి పెట్టింది.
ఈ ఏడాది అక్టోబర్ 7వతేదీన కెకె లైన్‌పై కొండ చరియలు విరిగి పడడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ ఉక్కుకు ఈ మార్గంలో నిత్యం ఐదు రేక్‌ల ముడిసరుకు సరఫరా జరిగేది. కెకె లైన్‌లో రాకపోకలకు అంతరాయం కలగడంతో ముడి సరుకు సరఫరా సరిపడే విధంగా జరగక పోవడంతో ఉక్కు ఉత్పత్తిని కుదించుకోవాల్సి వచ్చింది. ముడి సరుకు కొరతతో అప్రమత్తమైన ఉక్కు యాజమాన్యం ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ముడి సరుకు రవాణా చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈమేరకు రాయగడ మీదుగా ముడి సరుకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంది. అయితే ఈ మార్గంలో రోజుకు ఒక్క రేక్ మాత్రం దిగుమతి కావడంతో ఇది ఉక్కు అవసరాలకు ఎటూ సరిపోవడం లేదు. విశాఖ ఉక్కుకు పూర్తిస్థాయి ఉత్పత్తి చేసేందుకు అవసరమైన ముడి సరుకును సమకూర్చేందుకు ఉన్నతాధికారులకు మల్లగుల్లాలు పడుతున్నారు. కర్మాగారంలో మూడు బ్లాస్ట్‌ఫర్నేస్‌లు ఉండగా వాటిని పూర్తి స్థాయిలో నడిపేందుకు అవసరమైన ముడి సరుకు అందుబాటులో లేవని కార్మిక వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికారణంగానే ఒక బ్లాస్ట్ పర్నేస్‌ను తాత్కలికంగా షట్‌డౌన్ చేసి, మిలిగిన రెండు పర్నేస్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.