బిజినెస్

నిలదొక్కుకున్న మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 4: దేశీయ మార్కెట్ల నాలుగు రోజుల వరుస పతనానికి సోమవారం బ్రేక్ పడింది. మార్కెట్ల ప్రధాన సూచీలయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీలు సోమవారం నాటి సెషన్‌లో పడిపోకుండా నిలదొక్కుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పైకి, కిందికి కదలాడిన మార్కెట్ సూచీలు చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటీ), లోహపు, ఆరోగ్య సంరక్షణ రంగాలకు చెందిన ఇటీవల ధరలు పడిపోయిన షేర్లను ఎంపిక చేసుకొని మదుపరులు సోమవారం కొనుగోళ్లకు పూనుకోవడంతో సెనె్సక్స్ సానుకూల స్థాయి 32,870 పాయింట్ల వద్ద ముగిసింది. దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ తన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ప్రధాన కార్యనిర్వహణ అధికారి (సీఈఓ)గా సలీల్ పరేఖ్‌ను నియమించడంతో ఆ కంపెనీ షేర్లకు సోమవారం మార్కెట్‌లో మదుపరుల నుంచి మంచి ఆదరణ లభించింది. సెనె్సక్స్‌లో ఉన్న అన్ని కంపెనీలలో కన్నా ఈ కంపెనీ అత్యధికంగా లాభపడింది. ఇన్ఫోసిస్ షేర్ ధర 2.80 శాతం పెరిగింది. మంగళ, బుధవారాలలో రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన సమీక్ష జరుగనుండటం, ఈ వారం చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండటంతో సోమవారం షేర్ మార్కెట్‌లో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. లావాదేవీలు ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సర అయిదో ద్వై-మాసిక ద్రవ్య విధానాన్ని బుధవారం ప్రకటించనుంది. దేశీయ మదుపరులు ఇటీవల ధరలు పడిపోయిన షేర్లను తాజాగా కొనుగోలు చేయడానికి పూనుకోవడం నాలుగు రోజుల పతనం అనంతరం కీలక సూచీలు తిరిగి సానుకూల జోన్‌లోకి రావడానికి సహకరించిందని బ్రోకర్లు తెలిపారు.
సోమవారం 32,968.02 పాయింట్ల వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్, 33,000 మార్కును అధిగమించి 33,008.62 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే ఈ గరిష్ఠ స్థాయి వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో మళ్లీ పడిపోయింది. చివరకు 36.78 పాయింట్ల (0.11 శాతం) లాభంతో 32,869.72 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ క్రితం నాలుగు సెషన్లలో 891.50 పాయింట్లు పడిపోయింది.
50 షేర్లతో కూడిన నిఫ్టీ సోమవారం 5.95 పాయింట్ల (0.06 శాతం) లాభంతో 10,127.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ ఇంట్రా-డేలో 10,179.20- 10,095.70 పాయింట్ల మధ్య కదలాడింది. ఐటీ, ప్రభుత్వ రంగ (పీఎస్‌యూ) బ్యాంకులు, లోహపు, ఎఫ్‌ఎంసీజీ, మీడియా రంగాల షేర్లను మదుపరులు కొనుగోలు చేశారు. బ్యాంకులు, రియాల్టీ, ఫార్మా, ఇంధన రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో ఎక్కువగా విక్రయాలు చోటు చేసుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 0.30 శాతం పెరుగగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.74 శాతం పడిపోయింది.
బీఎస్‌ఈలో సోమవారం లాభపడిన కంపెనీలలో ప్రధానంగా హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్ ఉన్నాయి. టాటా స్టీల్, భారతి ఎయిర్‌టెల్, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, అదాని పోర్ట్స్, ఎస్‌బీఐ, విప్రో, హీరో మోటోకార్ప్, టీసీఎస్ కంపెనీలు కూడా లాభపడ్డాయి.