బిజినెస్

సంస్కరణలను వేగవంతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, మే 31: నిర్మాణాత్మక సంస్కరణలు చేపడతామని, దేశ జిడిపి వృద్ధిరేటు బలోపేతానికి వౌలిక రంగంపై మరింత శ్రద్ధ వహిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ.. జపాన్ మదుపరులకు హామీ ఇచ్చారు. ఆరు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా జైట్లీ.. మంగళవారం ఇక్కడ నిక్కీ నిర్వహించిన ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఆసియా’ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ స్టాక్ మార్కెట్లు లాభాల్లో నడిచేలా సంస్కరణలు తీసుకొస్తామని, ప్రస్తుత భారత జిడిపి వృద్ధి 7.6 శాతాన్ని అధిగమించే నిర్ణయాలు చేపడతామని అన్నారు. సరళమైన, స్థిరమైన, ఆమోదయోగ్యమైన పన్ను విధానాలను ప్రవేశపెడతామని కూడా జపాన్ మదుపరులకు జైట్లీ భరోసా ఇచ్చా రు. ఇకపోతే చైనా ఆర్థిక ప్రగతి మందగిస్తుండటంతో అత్యంత బలమైన ఆర్థిక చోదకశక్తి ఇక భారతేనని అన్నారు. గడచిన కొనే్నళ్లుగా ప్రపంచ వృద్ధిలో దాదాపు 50 శాతం చైనాపైనే ఆధారపడి ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు అది భారత్ వైపు మళ్లిందని పేర్కొన్నారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కీలకంగా భావిస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమో దం పొందుతుందన్న విశ్వాసాన్ని మరోసారి జైట్లీ వ్యక్తం చేశారు. అధికార బిజెపికి మెజారిటీ ఉన్న లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో జిఎస్‌టికి ఆమోదం లభించలేదన్నది తెలిసిందే. బిల్లులో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సూచిం చిన సూచనలను అమలు చేయడం, వివిధ రాష్ట్రాలు బిల్లుకు మద్దతిస్తుం డటంతో బిల్లు పాసవు తుందని జైట్లీ చెబుతున్నారు. ఇదిలావుంటే ఈ పర్యటన సందర్భంగా భారతీయ తొలి సావరిన్ వెల్త్ ఫండ్ ఎన్‌ఐఐఎఫ్‌లో విదేశీ పెట్టుబడులకు జైట్లీ ప్రయత్నిస్తున్నారు. నిరుడు డిసెంబర్‌లో 40,000 కోట్ల రూపాయలతో ఎన్‌ఐఐఎఫ్‌ను మోదీ సర్కారు ఏర్పాటు చేసినది తెలిసిందే.

chitram ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఆసియా’ సదస్సులో మాట్లాడుతున్న జైట్లీ