బిజినెస్

దక్షిణ కొరియాకు అగ్ర ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 5: నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెట్టుబడులతో వచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసే అంశంలో దక్షిణ కొరియాకు అగ్రప్రాధాన్యతనిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఓడరేవులు, ఓడరేవు ఆధారిత పరిశ్రమల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొరియా ఆదర్శమని, తమ రాష్ట్రంలో 14 ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు, వీటిలో ఇప్పటికే 6 ఓడరేవులు విస్తృతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చంద్రబాబు వివరించారు. మంగళవారం బూసన్ సిటీలో ఏర్పాటు చేసిన బిజినెస్ సెమినార్‌లో మాట్లాడుతూ ‘దేశ జనాభాలో నాలుగోశాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని, విస్తీర్ణంలో ఎనిమిదో పెద్ద రాష్టమ్రని, భారతదేశ తీర ప్రాంతంలో 13 శాతం తమ రాష్ట్ర సొంతమని’ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ‘్భరతదేశంలో వ్యవసాయ రంగం ఎప్పుడూ ఒక సవాలే. అలాంటి రంగంలో సైతం ఏపీ రెండంకెల వృద్ధి రేటును నమోదు చేస్తున్నదన్నారు. దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కానంతగా వ్యవసాయ రంగంలో 25.6 శాతం వృద్ధి సాధించిందన్నారు. మేము స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నామన్నారు. 15 ఏళ్లపాటు 15 శాతం వృద్ధి రేటు సాధించాలన్నదే లక్ష్యమని, 80 శాతం ప్రజా సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు వచ్చే వారికి 21 రోజులలో సింగిల్ డెస్కు పోర్టల్ ద్వారా అన్ని అనుమతులను ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి పరిశ్రమలకు అనుమతినిచ్చే ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఇప్పటివరకు 23,414 అనుమతులు ఇచ్చినట్లు, 6 మాసాలలో 98.06 శాతం, ఈ రెండు నెలలలో నూటికి నూరుశాతం సాఫీగా అనుమతులు అందించి చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. ఏపీలో ఎప్పుడూ పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, అందుకే సీఎన్‌బీసీ తమ రాష్ట్రానికి ‘స్టేట్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం ఇచ్చిందని, ఎఫ్‌డీఐ 3 అగ్రశ్రేణి రాష్ట్రాలలో ఒకటిగా గుర్తించిందని, ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో అగ్రస్థానం తమదేనని ముఖ్యమంత్రి చెప్పారు. విద్యుత్ రంగంలో ఏ అవార్డు ఉన్నా అది ఆంధ్రప్రదేశ్‌నే వరిస్తోందని, ఈ మూడేళ్లలో అలా 25 పురస్కారాలు వచ్చాయని వివరించారు.
ఏపీ సమర్థత తెలుసుకోవాలంటే కియోను అడగండి
వౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులకు, వ్యాపారాలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ సామర్థ్యాన్ని కియో మోటార్స్ గుర్తించిందని, ఏపీ సమర్థతను తెలుసుకోవాలంటే కియో ప్రతినిధులను అడిగినా చెబుతారన్నారు. రహదారులు, రైలు మార్గాలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇతర వౌలిక సదుపాయాలతో అన్ని ప్రాంతాలకు అనుసంధానం కలిగిన రాష్ట్రం దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ఏపీలో పారిశ్రామికంగా ఉత్తమ విధానం అమలులో ఉందని, పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామిక వేత్తలకు అత్యుత్తమ ప్యాకేజీ ఇస్తామన్నారు. రాష్ట్రంలో కొలువుదీరుతున్న పరిశ్రమల గురించి రంగాల వారీగా ఆటోమొబైల్ రంగంలో ఇసుజు, కియా, హీరో, భారత్ బెంజ్, అమరరాజా, అపోలో తదితర దిగ్గజ ఆటో కంపెనీలు వచ్చాయని ముఖ్యమంత్రి వివరించారు. ‘ఆటోమొబైల్ తరువాత వ్యవసాయాధారిత, ఆహారశుద్ధి పరిశ్రమలు వస్తున్నాయి. గుడ్లు, పండ్లు, ఉద్యాన ఉత్పత్తులలో అగ్రగామిగా ఉండటం మనకు కలిసివచ్చే అంశం. వస్త్ర పరిశ్రమ, మొబైల్ పరిశ్రమలు కూడా రాష్ట్రానికి పెద్ద ఎత్తున వచ్చాయి. ఫాక్స్‌కాన్, ఎంఐ, జియోనీ తదితర సంస్థలు వచ్చాయి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకొని అభివృద్ధి
‘ఇరవై ఏళ్ల క్రితం నేను ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాను. జంట నగరాలకు సైబరాబాద్ అనే మరొక నగరాన్ని చేర్చాను. ఆ ఫలాలను ఇప్పుడు హైదరాబాద్ అనుభవిస్తోంది. విభజన తరువాత మళ్లీ జీరో నుంచి నా పని మొదలైంది. ఒక సంక్షోభంలో మా ప్రయాణాన్ని ఆరంభించాం. ఐతే అదే సంక్షోభాన్ని అవకాశంగా తీసుకున్నాం. కొరియా కూడా ఈ కష్టాలను ఎదుర్కొంది’ అని చంద్రబాబు అన్నారు. ‘అయినప్పటికీ అభివృద్ధి అనూహ్యంగా జరిగింది. శరవేగంగా దేశం అభివృద్ధి చెందింది. ఇది ఇక్కడి పాలకులు, అభివృద్ధిలో భాగస్వాములైన మీ అందరివల్లనే సాధ్యమైంది. మేమిప్పుడు ఆ స్ఫూర్తిని తీసుకుని అభివృద్ధి బాటలో ఉన్నాం. నవరాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్‌ను నిర్మించే క్రతువులో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాను’ అని ముఖ్యమంత్రి వివరిస్తున్నప్పుడు బిజినెస్ సెమినార్‌లో పాల్గొన్న ప్రతినిధులు శ్రద్ధగా విన్నారు.
రాజధానికి భూసమీకరణ..ప్రజా విశ్వాసానికి నిదర్శనం
రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం దగ్గర తగినంత భూమి లేదని, భూముల సేకరణకు తగినన్ని నిధులు కూడా లేని సంక్షోభ పరిస్థితిలో తాను ఇచ్చిన ఒకే ఒక్క పిలుపుతో 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి అందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అది తమపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఉదాహరణ అని చెప్పారు. అమరావతిని ప్రపంచంలోని అత్యాధునిక 5 నగరాలలో ఒకటిగా ఉండేలా నిర్మిస్తున్నామని, ప్రపంచం దృష్టిని తమవైపు తిప్పుకోగలిగామన్నారు.
ఐటీ..ఐఓటీతో జవాబుదారీ పరిపాలన
పారదర్శక పాలనకు, పాలనలో జవాబుదారీతనానికి భారత్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రోల్‌మోడల్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి చెప్పారు. ఐటీ, ఐవోటీ పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పారదర్శక పాలన అందిస్తున్న ప్రభుత్వం తమది అని అన్నారు. ఇ-ఆఫీసు, డిజిటల్ క్లాసురూమ్స్, డ్రోన్లు ఉపయోగిస్తున్నామని, రియల్ టైమ్ గవర్నెన్స్ అమలు చేస్తున్నట్టు తెలిపారు. పౌరులు ప్రభుత్వంతో నేరుగా మాట్లాడే వ్యవస్థను ఏర్పాటు చేశాం. అవినీతికి తావులేదు. అత్యంత పారదర్శకంగా ఆన్‌లైన్‌లో అన్నీ అందుబాటులో ఉంచుతున్నాం అన్నారు. ఒక్క ఫోన్ కాల్, మెసేజీతో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ప్రాజెక్టుతో మా రాష్ట్రానికి రండి. పెట్టుబడులు పెట్టండి. మేము ఎంత సమర్థులమో, మా రాష్ట్రంలో వ్యాపారం ఎంత సులభమో మా రాష్ట్రానికి వచ్చి మీరే ప్రత్యక్షంగా చూడండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరిస్తూ ప్రసంగం ముగించారు. కొరియా పర్యటనలో ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖల మంత్రి అమరనాథ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్, ఈడీబీ జాస్తి కిషోర్, ఎపీఐఐసీ అహ్మద్ బాబు ఉన్నారు.

చిత్రం.... మేక్ ఇన్ ఇండియా కొరియా సెంటర్‌లో పిల్లలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం