బిజినెస్

ఏపీలో ‘కొరియా పారిశ్రామిక కాంప్లెక్స్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లో ‘కొరియా ఇండస్ట్రియల్ కాంప్లెక్స్’ త్వరలో ఏర్పాటు కానుంది. ఈ మేరకు బూసన్‌లో జరిగిన బిజినెస్ సెమినార్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘మేకిన్ ఇండియా కొరియా సెంటర్ (ఎంఐసీ) మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. ఎంవోయూలో భాగంగా బూసన్‌లో ఆంధ్రప్రదేశ్ సెంటర్‌ను కూడా నెలకొల్పుతారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న భారత రాయబార కార్యాలయం, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ‘మేకిన్ ఇండియా కొరియా సెంటర్’ ఏర్పాటైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దక్షిణ కొరియా పర్యటన రెండో రోజున మంగళవారం ‘బిజినెస్ సెమినార్’లో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన సమావేశంలో పెట్టుబడిదారులతో ముఖాముఖీ సమావేశమయ్యారు. దక్షిణ కొరియాలోని మత్స్య విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరస్పరం సహకరించుకునేందుకు ఉన్న అవకాశాలపై బూసన్ వైస్ మేయర్ కిమ్ యంగ్‌వాన్‌తో ముఖ్యమంత్రి చర్చించారు. మత్స్య రంగంలో ఏపీతో కలిసి పనిచేసేలా పుక్యంగ్ నేషనల్ యూనివర్శిటీ ప్రెసిడెంట్‌తో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రికి కిమ్ యంగ్ వాన్ హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి బృందం దక్షిణ కొరియాలో ప్రఖ్యాతి గాంచిన బూసన్ న్యూపోర్టును సందర్శించింది. 2006లో ప్రారంభమైన బూసన్ పోర్టు విశిష్టతలు, సామర్థ్యం వివరాలను పోర్టు వర్గాలు ముఖ్యమంత్రి బృందానికి ప్రెజెంటేషన్ ద్వారా వివరించాయి. ప్రస్తుతం 30 బెర్తులుగా ఉన్న పోర్టు సామర్థ్యాన్ని త్వరలో 45 బెర్తులకు పెంచుతున్నామని, ప్రస్తుతం వంద దేశాల్లోని 500 పోర్టులకు తమ కార్యకలాపాలు సాగిస్తున్నామని తెలిపాయి. బూసన్ పోర్ట్ అథారిటీ వైస్ ప్రెసిడెంట్ కాంగ్ బూ వో ముఖ్యమంత్రి బృందాన్ని స్వయంగా తీసుకెళ్లి పోర్టు కార్యకలపాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓడరేవులతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కాంగ్ బూవోను కోరారు.
ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖల మంత్రి అమరనాథరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ అరోకియా రాజ్, ఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణకిశోర్, ఎపీఐఐసీ ఎండీ అహ్మద్ బాబు ఉన్నారు.

చిత్రం..మేక్ ఇన్ ఇండియా కొరియా సెంటర్, ఏపీఐఐసీ మధ్య ఎంఓయూ కుదుర్చుకుంటున్న దృశ్యం